• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

24గం. పాటు విద్యుత్ బంద్: ఏటీఎం కష్టాలు, కార్లపై కూలిన చెట్లు (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: వర్షం, గాలి దుమారం వల్ల భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఓ రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో, చాలాచోట్ల ఏటీఎంలు పని చేయలేదు. వినియోగదారులు ఏటీఎంల నుంచి డబ్బులు రాక ఇబ్బందులు పడ్డారు.

సికింద్రాబాద్, రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో వందలాది ఏటీఎంలు పని చేయలేదు. పలు ప్రాంతాల్లో ఏకంగా 24 గంటల పాటు విద్యుత్ లేకపోవడం గమనార్హం. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 1912 కాల్ సెంటర్‌కు శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు 8వేల ఫిర్యాదులు అందాయి. మరికొందరు కాల్ బిజీ రావడంతో ఫిర్యాదు చేయలేకపోయారు.

ఈదురుగాలులు నగరంలో బీభత్సాన్ని సృష్టించాయి. పదిరోజుల క్రితం నగరం మొత్తం అల్లకల్లోలం చేసిన గాలివానను మరచిపోక ముందే శనివారం రాత్రి ప్రచండ గాలులకు కొన్ని ప్రాంతాల్లో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

వర్షం ఓ మోస్తరుగా కురిసినా. ఈదురుగాలులు ఎక్కువ నష్టం చేకూర్చాయి. మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, గాంధీనగర్‌, ఆబిడ్స్‌, మలక్‌పేట, డబీర్‌పుర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లు విరిగి పడ్డాయి.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

బాగ్‌లింగంపల్లి, రాంనగర్‌ ప్రాంతాల్లో చెట్లు కూలి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రాంతాల్లో 210 చెట్లు పడిపోయినట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు వెల్లడించాయి.

 ఈదురు గాలులు

ఈదురు గాలులు

చెట్లు కూలి పడటంతో ద్విచక్ర వాహనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. సౌత్‌జోన్‌ పరిధిలో 70 చోట్ల చెట్లు కూలగా, సెంట్రల్‌ జోన్‌లో 70, ఈస్ట్‌జోన్‌లో 14, నార్త్‌జోన్‌లో 55 చెట్లు పడిపోయాయి. గోల్కొండ చౌరస్తాలో వృక్షం కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

చెట్లు కూలి విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై పడటంతో విద్యుత్తు సరఫరాకు ఆయా ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

విద్యుత్ తీగలు తెగిపోయాయి. చాలాచోట్ల విద్యుత్ సరఫరాలో నిలిచిపోయింది. హోర్డింగ్స్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు విద్యుత్తు తీగలకు చుట్టుకుని కొన్నిచోట్ల సరఫరా నిలిచింది.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

మల్కాజిగిరిలో కొన్నిప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా 24 గంటలు గడిచినా పునరుద్ధరించలేదు. పద్మారావునగర్, సీతాఫల్‌మండీ, లాలాపేట సబ్‌స్టేషన్ల పరిధిలో చిలకలగూడ, మెట్టుగూడ, వారాసిగూడ, బౌద్దనగర్‌, పార్సీగుట్ట, అడ్డగుట్ట ఫీడర్లలో ఆదివారం రాత్రికి విద్యుత్తు లేదు.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

ఇసామియాబజార్‌ వాసులు రాత్రంతా విద్యుత్తు లేదని సుల్తాన్‌బజార్‌ పోలీస్ స్టేషన్‌లో విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు.

 ఈదురు గాలులు

ఈదురు గాలులు

సాయంత్రానికి 95 శాతం విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.

ఈదురు గాలులు

ఈదురు గాలులు

మొత్తంగా నగరంలో 210 భారీ వృక్షాలు, 327 స్తంభాలు నేల కూలాయని తెలుస్తోంది. 250 ఫీడర్లలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. అంధకారంలోనే పలు బస్తీలు ఓ రోజు పాటు గడిపాయి.

 ఈదురు గాలులు

ఈదురు గాలులు

గాలుల భీభత్సంతో అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులను చక్కదిద్దేందుకు జలమండలి, డిస్కం, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్‌, ఇతర శాఖ అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి జనార్దన్ రెడ్డి ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

English summary
Hundreds of ATMs went kaput as several localities in the city went without power supply for more than 24 hours. While ATMs located in bank branches ran for four to five hours with back-up power, those located on main roads were unable to dispense any money. The worst-hit area was Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X