వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ అభినందించారు: పాలసీపై కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. కొత్త పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు నిలయంగా మారుతుందని చెప్పారు.

ఫ్యాప్సీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా' ముగింపు సదస్సుకు రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అందరి ప్రశంసలు పొందుతోందని చెప్పారు.

తమ విధానాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ పత్రిక ఎకనామిక్ టైమ్స్ ప్రత్యేక వ్యాసం రాసిందని తెలిపారు. స్వయం ధ్రువీకరణ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు జారీచేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తున్నమన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని అనుమతుల ప్రక్రియ, అవినీతిరహిత పాలన తమ ప్రత్యేకత అని, ఈ విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారని చెప్పారు. ఇతర రాష్ట్రాలుకూడా ఈ విధానాన్ని అనుసరించాలని చెప్పారు.

పారిశ్రామిక పాలసీ

పారిశ్రామిక పాలసీ

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు.

పారిశ్రామిక పాలసీ

పారిశ్రామిక పాలసీ

కొత్త పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు నిలయంగా మారుతుందని చెప్పారు.

పారిశ్రామిక పాలసీ

పారిశ్రామిక పాలసీ

ఫ్యాప్సీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా' ముగింపు సదస్సుకు రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు హాజరయ్యారు.

పారిశ్రామిక పాలసీ

పారిశ్రామిక పాలసీ

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అందరి ప్రశంసలు పొందుతోందని చెప్పారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగంగా జనవరిలో హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్ నిర్వహించ తలపెట్టామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన ప్రాంతమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణంతోపాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే పరిశ్రమలు ఏర్పాటుకు రెండున్నర లక్షల ఎకరాల భూమిని భూ బ్యాంకుకు బదలాయించామన్నారు. అందులో 1.40 లక్షల ఎకరాలు వెంటనే పరిశ్రమలు ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని వివరించారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే వారి కోసం రూ. 200 కోట్లు కేటాయించామని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం ద్వారా అవసరమైన నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. కాలుష్య నివారణతోపాటు వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల్లోని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి హరిత హారంలో భాగస్వాములు కావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం పది నెలల కాలంలోనే సామర్థ్యాన్ని నిరూపించుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో మేక్ ఇన్ తెలంగాణ తీసుకువస్తున్నామని తెలిపారు.

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల్లో ఎన్నో అపోహలు, అనుమానాలుండేవన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అవన్నీ పటాపంచలయ్యాయని చెప్పారు. హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, పెట్టుబడిదారులు సంతోషంగా పెట్టుబడులు పెట్టవచ్చని భరోసా ఇచ్చారు. పరిశ్రమల ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి దొరకడంతోపాటు రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని నాయిని అన్నారు.

English summary
Telengana IT & Panchatat Raj minister K. T. Rama Rao said today that a record 25 projects were given clearance through the T PASS policy in just 30 days in the state based on self certification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X