హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు: 5వేల దిగువకు యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 31,187 కరోనా పరీక్షలను నిర్వహించగా.. కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు చేశారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,433కి చేరింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం వెల్లడించింది.

గురువారం కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1563కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,83,048కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4822 కరోనా కేసులున్నాయి.

298 new corona cases reported in Telangana: 2 deaths in last 24 hours

2614 మంది హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 72,15,785కు చేరింది. మరో 558 మంది కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శుక్రవారం దేశ వ్యాప్తంగా 9,16,951 నమూనాలను పరీక్షించగా.. 18,222 మందికి కరోనా సోకినట్లు తేలింది. శుక్రవారం నాటికి దేశ వ్యాప్తంగా 18,02,53,315 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 1,04,31,639 మందికి కరోనా సోకింది.

శుక్రవారం ఒక్కరోజే 19,253 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,56,651 మంది మహమ్మారి జయించారు. అలాగే 15 రోజులుగా కరోనా మరణాలు 300 దిగవనే నమోదవడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,24,190కి తగ్గాయి. రికవరీ రేటు 96.39 శాతానికి చేరింది.

English summary
298 new corona cases reported in Telangana: 2 deaths in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X