వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మక్కా దిగ్భ్రాంతి: ఆరా తీస్తున్న ఏపీ-టీ ప్రభుత్వాలు, హజ్‌లో విషాద ఘటనలివీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అనంతపురం: మక్కాలో తొక్కిసలాట జరిగి 220 మంది మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారి గురించి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. జెడ్డాలోని భారత రాయబార అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. దీంతో జెడ్డాలోని భారత కాన్సులేట్‌ను అధికారులు సంప్రదిస్తున్నారు.

బాధించింది: పల్లె రఘునాథ్ రెడ్డి

సౌదీ అరేబియాలోని హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాట, 220 మంది మృతి విషాదం చాలా బాధించిందని ఏపీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఏపీకి చెందిన యాత్రికులు ఎంతమంది ఉన్నారో వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. అందర్నీ సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీకి చెందిన 2,200 మంది హజ్ యాత్రికులను క్షేమంగా తీసుకు రావాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి సూచించారు. హజ్ ప్రమాదం పైన చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

2nd Hajj tragedy: KCR condoles the mecca incident

ఏపీ హజ్ యాత్రికులు సురక్షితం

మక్కా మసీదును దర్శించుకునేందుకు వెళ్లిన యాత్రీకుల్లో తమ శిబిరంలో ఉన్న 400 మంది తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారని ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ అబిద్ రషీద్ ఖాన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి హజ్ యాత్రకు వెళ్లిన ఇతరుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల యాత్రికులకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి దిగ్భ్రాంతికర వార్తలు వినలేదన్నారు.

హజ్ యాత్రలో విషాద సంఘటనలు

ముస్లీంల హజ్ యాత్రలో ఈ పదిహేను రోజుల్లో రెండు ఘోర విషాద సంఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 12న క్రేనే మీద పడి 107 మంది, గురువారం తొక్కిసలాటలో 220 మందికి పైగా మృత్యువాత పడ్డారు. హజ్ యాత్రలో గతంలోను పలు విషాధాలు చోటు చేసుకున్నాయి.

మక్కాలో ప్రార్థనలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ముస్లింలు ఇక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో ప్రార్థనలు చేయడానికి వారికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు వందల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.

- 1987లో ఇరానియన్ యాత్రికులు, సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 402 మంది చనిపోయారు.
- జులై 2 1990న మక్కాలోని పాదచారుల ప్రాంతం వద్ద జరిగిన తొక్కిసలాటలో 1,426మంది మృతి.
ఇందులో మలేషియా, ఇండోనేషియా, పాకిస్థాన్‌లకు చెందిన వారు ఉన్నారు.
- మే 23, 1994న జరిగిన తొక్కిసలాటలో 270మంది చనిపోయారు. మీనా వద్ద రాళ్లు విసిరే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
- 1997లో జరిగిన గుడారాల వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో అగ్నికి విపరీత గాలులు తోడై చెలరేగిన మంటల్లో 340 మంది చనిపోయారు.
- ఏప్రిల్‌ 9 1998న జమారత్‌ బ్రిడ్జ్ పైన జరిగిన ఘటనలో 118 చనిపోయారు.
- మార్చి 5, 2001న సంభవించిన ప్రమాదంలో 35 మంది మృతి.
- ఫిబ్రవరి 11, 2003న జరిగిన ఘటన పలువురు చనిపోయారు.
- ఫ్రిబవరి 1, 2004లో 251మంది చనిపోయారు. హజ్ వేడుక ముగింపు చివరి రోజు జరిగిన ప్రమాదం.
- జనవరి 12, 2006న జరిగిన తొక్కిసలాటలో 346మంది మృతి
- సెప్టెంబర్‌ 12న భారీ క్రేన్‌ కూలిన ఘటనలో 107 మంది యాత్రికులు మృతి.
- 24 సెప్టెంబర్‌ 2015న తొక్కిసలాటలో 220మందికి పైగా మృత్యువాతపడ్డారు.

English summary
2nd Hajj tragedy: Telangana CM KCR condoles the mecca incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X