వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం : రెండోవిడతలోనూ భారీ పోలింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో రెండోవిడత స్థానిక సంస్థల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాల్లో 77.63 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 31 జిల్లాల్లో 10371 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడోవిడత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. ఫలితాలు మాత్రం లోక్ సభ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ నెల 27న లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు.

2nd phase local body election polling increase

భవితవ్యం నిక్షిప్తం ..
179 జడ్పీటీసీ స్థానాలకు 805 మంది అభ్యర్థులు, 1850 ఎంపీటీసీ స్థానాలకు సుమారు 6వేల మంది అభ్యర్థులు బరిలో దిగారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 218 స్థానాల్లో పోలింగ్‌ ప్రక్రియ 4 గంటలకే ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. క్యూలైన్లో నిల్చొన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.

పోలింగ్ శాతం
జిల్లాలవారీగా పోలింగ్ చూస్తే ... ఆదిలాబాద్‌ 75.33, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 75.96, మంచిర్యాల 77.17, నిర్మల్‌ 76.68, జగిత్యాల 74.30, కరీంనగర్‌ 73.54, పెద్దపల్లి 78.14, రాజన్న సిరిసిల్ల 76.21, భద్రాద్రి కొత్తగూడెం 76.70, ఖమ్మం 82.05, జోగులాంబ గద్వాల 77.86, మహబూబ్‌నగర్‌ 73.68, నాగర్‌కర్నూల్‌ 76.75, వనపర్తి 75.18, నారాయణపేట 72.47, మెదక్‌ 80.85, సంగారెడ్డి 76.97, సిద్దిపేట 80.47, కామారెడ్డి 74.86, నిజామాబాద్‌ 76.28, నల్గొండ 82.56, సూర్యాపేట 84.15, యాదాద్రి భువనగిరి 85.33, రంగారెడ్డి 82.49, వికారాబాద్‌ 72.64, జనగామ 76.50, జయశంకర్‌ భూపాలపల్లి 76.75, మహబూబాబాద్‌ 77.45, వరంగల్‌ గ్రామీణం 77.84, వరంగల్‌ 77.83, ములుగు 69.89 శాతం చొప్పున నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

English summary
In Telangana, the voting percentage in the local bodies has increased substantially. Officials said 77.63 per cent of the 180 ZP and 1913 MPTC seats were registered. Out of the 10,371 centers in 31 districts, voters exercised their franchise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X