హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్‌పోర్టులో నోట్ల కట్టలు సీజ్.. మూడేళ్లలో అదే పెద్ద మొత్తం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వారు తమ వెంట అడ్డదారిలో బంగారం తీసుకొస్తూ కస్టమ్ అధికారుల కంటికి చిక్కుతున్నారు. ఆ క్రమంలో భారీగా నగదు పట్టుబడుతుండటం గమనార్హం. తాజాగా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న థామస్ అనే వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయల నగదు దొరకడం చర్చానీయాంశమైంది.

సీఐఎస్ఎఫ్‌ అధికారుల తనిఖీల్లో థామస్ బండారం బయటపడింది. ఇదంతా అక్రమ నగదుగా తేల్చారు అధికారులు. సరైన పత్రాలు లేకుండా ఇంత పెద్దమొత్తంలో తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఈ స్థాయిలో భారీగా నగదు దొరకడం ఇటీవల ఇదే మొదటిసారి. థామస్ నుంచి 3 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.

సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!

3 crores seized in shamshabad airport

గతంలో చాలాసార్లు కోటికి పైగా నగదు పట్టుబడిన సందర్భాలున్నాయి. 2016, అక్టోబరులో మాత్రం దాదాపు 14 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడేళ్ల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఇదే మొదటిసారి.

English summary
Number of Kg's Gold caught by Customs Officers in Shamshabad Airport Regularly. But, The Huge Amount Caught by CISF Officials is going hot topic. 3 Crore Rupees caught from one passenger who named thomas and seized that amount, the person handedover to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X