• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డ్రగ్స్ కేసు: మరో ముగ్గురు సినీతారలు! లోలోపలే సిట్ దర్యాప్తు,వారిలో ఓ ప్రముఖ హీరోయిన్?

By Ramesh Babu
|

హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమను అతలాకుతలం చేసిన డ్రగ్స్ వ్యవహారం ఇక ముగిసిన అధ్యాయమేనా? కొద్దిరోజులుగా ఈ కేసులో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో అందరి మదిలో మెదులుతున్న అనుమానం ఇది. ఒత్తిడికి తలొగ్గి కేసు పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే బయట ప్రచారం సంగతి ఎలా ఉన్నా మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తునకు ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు మాత్రం తమపని తాము చేసుకుంటూ పోతున్నారు. హడావుడి లేకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరో ముగ్గురు సినీతారలకు సంబంధం?

మరో ముగ్గురు సినీతారలకు సంబంధం?

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దర్యాప్తులో మరో ముగ్గురు సినీతారలకు కూడా డ్రగ్స్ ముఠాతో సంబంధముందని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. చట్టబద్ధంగా వీరిపై చర్యలు తీసుకోవాలంటే మరికొన్ని ఆధారాలు కావాలి కాబట్టి ఆ దిశగా లోలోపలే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. సరైన సమయంలో వీరిని కూడా పిలిపించి వాంగ్మూలం నమోదు చేసే ఆలోచనతో అధికారులు ఉన్నారు.

రంగంలోకి దిగిన సినీ పెద్దలు...

రంగంలోకి దిగిన సినీ పెద్దలు...

విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ, వాటిని సరఫరా చేస్తూ పట్టుబడ్డ కెల్విన్‌ ముఠాను విచారించినపుడు విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా తెలుగు సినీపరిశ్రమకు చెందిన పలువురు తారలకు కూడా కెల్విన్‌ మత్తుమందులు సరఫరా చేసినట్లు వెల్లడైంది. మొత్తం 11 మందిని సిట్ అధికారులు విచారించారు. ఇది సంచలనం సృష్టించింది. దాంతో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సినీపెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. పరిశ్రమ పరువు పోతోందని వాపోయారు.

ఒత్తిళ్ల కారణంగా వారిని పక్కనపెట్టారా?

ఒత్తిళ్ల కారణంగా వారిని పక్కనపెట్టారా?

అయితే సిట్ అధికారులు విచారించిన 11 మందితో పాటు ఇంకా పలువురికి డ్రగ్స్ తో సంబంధం ఉందని, కానీ ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిళ్ల కారణంగా వారిని పక్కనపెట్టారనే వాదన తెరపైకి వచ్చింది. కొంతకాలంగా దర్యాప్తులో స్తబ్ధత నెలకొనడం కూడా అ అనుమానాలకు బలం చేకూర్చింది. బయట ఎన్నిరకాల వాదనలు వినిపిస్తున్నా సిట్ అధికారులు మాత్రం తమపని తాము చేసుకుంటూ వెళుతున్నామని చెబుతున్నారు. సినీతారల విచారణలో వెల్లడైన అంశాలు, ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో బయటపడ్డ విషయాల ఆధారంగా మరో ముగ్గురు సినీతారలు కూడా డ్రగ్స్ వలలో చిక్కుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఒకరు ప్రముఖ హీరోయిన్, మిగిలిన ఇద్దరు...

ఒకరు ప్రముఖ హీరోయిన్, మిగిలిన ఇద్దరు...

విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆ ముగ్గురు తారలలో.. ఒకరు ప్రముఖ హీరోయిన్‌ కాగా మరో ఇద్దరు తెలుగు సినీపరిశ్రమలో పెద్ద కుటుంబాలకు చెందిన వారు. అగ్ర హీరోయిన్లలో ఒకరుగా చలామణీ అవుతున్న ఓ నటి కొకైన్‌ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె డ్రగ్స్ వాడుతుండా తీసిన ఆరు వీడియో దృశ్యాలను కూడా సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం నిర్వహించిన ఒక సినీవేడుకలో బహిరంగంగానే డ్రగ్స్ తీసుకున్న ఆ హీరోయిన్ అదుపు తప్పి పడిపోగా మరో నటుడు ఆమెను తన కారులో తీసుకెళ్లి దింపినట్లు సమాచారం. మరో ఇద్దరు తారల పరిస్థితీ ఇదేనని, వీరిలో ఒక నటుడైతే పూర్తిగా డ్రగ్స్ ఊబిలో కూరుకుపోయి ఉన్నాడని తెలుస్తోంది. సిట్ అధికారులు విచారించిన సినీ ప్రముఖుల్లో ఎక్కువ మంది ఈ ముగ్గురి పేర్లే చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు ఆ ముగ్గురి గురించి పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. మరిన్ని పటిష్ఠ ఆధారాలు సేకరించిన తరువాత ఆ ముగ్గురు తారలకు సంబంధించి అధికారులు రంగంలోకి దిగనున్నారట.

English summary
The Hyderabad drug scandal given a shock to telugu film industry. SIT officials summonned, questioned many people from tollywood. But later what happened? Nothing is coming out about this case. Is this drugs case closed? People suspecting now after political pressure from the high profile persons in the tollywood SIT officials are not going further in this case. But this is wrong. According to the sources, SIT officials are doing their job internally. According to them, 3 more tollywood personalities has relations in the drugs case. One of them is a popular heroine in the tollywood, and remaining two are belongs to high profile families of the same field, they concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X