వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.3కే చీర: ఎగబడిన మహిళలు, గందరగోళం, చివరకు షాపింగ్ మాల్ మూసేశారు!

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: నగరంలోని ఓ షాపింగ్ మాల్ రూ.3కే చీర ఇస్తామంటూ ప్రచారం చేయడంతో భారీ ఎత్తున మహిళలు, పురుషులు ఎగబడ్డారు. యాజమాన్యం కూడా ఊహించని రీతిలో చీరల కోసం మహిళలు పోటెత్తడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఉద్రిక్తత పరిస్థితులు

ఉద్రిక్తత పరిస్థితులు

కాగా, మహిళలు భారీ సంఖ్యలో రావడం, ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం షాపింగ్‌ మాల్‌ను మూసివేశారు. కానీ, అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. ఆఫర్లు ప్రకటించి, షాపింగ్‌ మాల్‌ మూసివేయడంపై మహిళలు తిరగబడ్డారు.

రూ.3కే చీర అంటూ విస్తృ ప్రచారం

రూ.3కే చీర అంటూ విస్తృ ప్రచారం

అయితే, అంతకుముందు 3 రూపాయలకే చీర అంటూ కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది. సెప్టెంబర్‌ 24,25,26 తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. తన మూడవ వార్షికోత్సవం సందర్భంగా రూ.3కే చీర ఇస్తోంది. ఇవే కాకుండా ఇంకా మరెన్నో ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఆఫర్లను కాసం పుల్లయ్య షాపింగ్‌ మాల్‌ ప్రకటించింది.

భారీ ఆఫర్లు-ఎగబడిన మహిళలు

భారీ ఆఫర్లు-ఎగబడిన మహిళలు

అంతేగాక, లెగ్గింగ్‌, నైటీస్‌, టీ-షర్ట్‌లను కూడా 3 రూపాయలకే అందిస్తామంటూ తెగ ప్రచారం చేసింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం రూ.1.00 గంటల వరకు ఈ ఆఫర్లను ఉంచింది. ప్రతి రూ.999 విలువ గల వస్త్రాల కొనుగోలుపై చుడీదార్స్‌, డ్రస్‌ మెటీరియల్‌, లెహంగాస్‌,కుర్తీస్‌ను ఆఫర్‌ చేసింది. ఈ ఆఫర్లను చూసిన మహిళలు భారీ ఎత్తును షాప్ ముందు బారులు తీరారు.

షాపింగ్ మాల్ మూసివేత.. మహిళల ఆగ్రహం

షాపింగ్ మాల్ మూసివేత.. మహిళల ఆగ్రహం

భారీ సంఖ్యలో వచ్చిన మహిళలను నిలువరించలేకపోయిన యాజమాన్యం చివరికి దుకాణాన్ని మూసివేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. దుకాణంలో కిక్కిరిసిన మహిళలను బయటకు పంపించారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని దుకాణం యాజమాన్యంపై మండిపడ్డారు. కాగా, తమకు రూ.3 చీరలు దక్కని మహిళలు కూడా షాపింగ్ మాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
3 Rs Saree Offer Leads To Ruckus At Shopping Mall In Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X