• search
 • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బోరువెల్ హార్రర్: తెలంగాణలో మూడేళ్ల చిన్నారిని బలి తీసుకున్న బోరుబావి: 25 అడుగుల లోతులో

|

హైదరాబాద్: బోరుబావి మరో చిన్నారిని మింగేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పొడిచన్ పల్లిలో బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయి వర్ధన్ మరణించాడు. ఆ చిన్నారి నిర్జీవ దేహాన్ని పోలీసులు, సహాయక సిబ్బంది వెలికి తీశారు. బోరుబావిలో 25 అడుగుల లోతులో సాయి వర్ధన్ మృతదేహం చిక్కుకుని కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టమ్ కోసం అంబులెన్స్‌లో పాపన్నపేట్ ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు సజీవంగా తిరిగి వస్తాడని ఆశించిన తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

 తాత పొలానికి వచ్చి మృత్యుకుహరంలోకి

తాత పొలానికి వచ్చి మృత్యుకుహరంలోకి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నివాసం ఉండే గోవర్ధన్, నవీన దంపతుల మూడో కుమారుడు సాయి వర్ధన్‌. వయస్సు మూడు సంవత్సరాలు. గోవర్ధన్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. నవీన స్వస్థలం పొడిచన్ పల్లి. కొద్దిరోజుల కిందట అతను తన భార్య నవీన, పిల్లలను అత్తగారి ఇంటికి పంపించాడు. నవీన తండ్రి భిక్షపతికి పొడిచన్ పల్లిలో మూడెకరాల పొలం ఉంది. అందులో రెండు బోర్లు వేయించాడు. ఒక బోరులో నీళ్లు పడకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. అలా వదిలేసిన బోరుబావే.. అతని మనవడిని బలి తీసుకుంది. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ సాయివర్ధన్ దురదృష్టవశావత్తూ బోరుబావిలో పడిపోయాడు.

నాలుగు జేసీబీలతో సమాంతరంగా

నాలుగు జేసీబీలతో సమాంతరంగా

సాయివర్ధన్‌ను రక్షించడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే నాలుగు జేసీబీలను సంఘటనా స్థలానికి రప్పించారు. మరోవంక బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపించసాగారు. అంబులెన్స్, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బోరుబావి సుమారు 150 అడుగుల లోతు వరకు ఉండొచ్చని, సాయి వర్ధన్ 120 అడుగుల లోతులో చిక్కుకుని ఉండొచ్చని ప్రారంభంలో అనుమానించారు. సాయివర్ధన్ 25 అడుగుల లోతులోనే చిక్కుకున్నట్లు గుర్తించారు. లోతు తక్కువే కావడంతో జేసీబీలతో సమాంతర గొయ్యిని తవ్వడం ఆరంభించారు.

  చింతమడకలో ఆరోగ్యశిబిరాన్ని ప్రారంభించిన హరీష్ రావు || Harish Rao Started Health Camp In Chintamadaka
  10 గంటల పాటు

  10 గంటల పాటు

  సుమారు 10 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలను కొనసాగించారు. గురువారం తెల్లవారు జామున సాయి వర్ధన్ చిక్కుకుపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే సాయి వర్ధన్ నిర్జీవంగా కనిపించాడు. బోరుబావిలో పడిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ చిన్నారి తన తుదిశ్వాస విడిచి ఉండొచ్చని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టమ్ కోసం పాపన్నపేట్ ఆసుపత్రికి తరలించారు. 25 అడుగుల లోతులోనే చిక్కుకుని ఉండటం వల్ల ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఆశించారు. బోరుబావిలో పడిన కొన్ని నిమిషాల్లోనే ఊపిరి ఆడక మరణించి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు.

  English summary
  Another kid died in Borewell, Podchanpally village of Papannapet Mandal in Medak district of Telangana, Borewell horror News, Sai Vardhan is no more, Sai Vardhan who slipped and fell into an abandoned borewell in Podchanpally village in Medak district dies.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more