మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోరుబావిలో చిన్నారి, 120-150 అడుగుల లోతులో.. 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వకం..

|
Google Oneindia TeluguNews

అదే నిర్లక్ష్యం.. అదే లెక్కలేనితనం... మరో చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. నీటి కోసం బోరు వేశాడు... అయితే నీరు పడలేదు అని అలాగే వదిలేశాడు. మూడేళ్ల చిన్నారి పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు జేసీబీల సాయంతో చిన్నారిని బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బాలుడు సాయంత్రం బావిలో పడిపోగా.. అతని అరుపులు వినిపించడం లేదు అని కటుుంబసభ్యులు అంటున్నారు.

Recommended Video

Telangana Borewell Mishap Video
రెండో బారుబావిలో..

రెండో బారుబావిలో..


మెదక్ జిల్లా పాపంపేట మండలం పుడ్చన్‌పల్లి పంట పొలంలో బోరు వేశారు. అయితే నీరు పడకపోవడంతో అలాగే వదిలేశాడు. అక్కడే ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు హర్షవర్థన్.. అందులో పడిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్య్కూ టీం రంగంలోకి దిగింది. బోరు బావి వద్దకు నాలుగు జేసీబీలను తీసుకొచ్చారు. బోరుబావి పక్కన సమాంతరంగా తవ్వుతున్నారు.

120 అడుగుల లోతులో..

120 అడుగుల లోతులో..

బాలుడు 120 నుంచి 150 అడుగుల లోతులో పడి ఉన్నట్టు సిబ్బంది భావిస్తున్నారు. అతనిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. బోరుబావిలో చిన్నారిని వెలికితీసే పనులను కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా తవ్వి.. చిన్నారిని తీస్తామని నిపుణులు అంటున్నారు. మరోవైపు బావిలో ఆక్సిజన్ పంపించి.. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తాత పొలంలో..

తాత పొలంలో..

పొలంలో భిక్షపతి బోరు వేయిస్తున్నాడు. భిక్షపతి కుమారుడు గోవర్ధన్.. గోవర్థన్ మూడో కుమారుడే సాయి వర్థన్.. అంటే తాతా పొలంలో వేసిన బోరుబావిలోనే చిన్నారి పడిపోయాడు. పొలంలో గత మూడురోజుల నుంచి బోర్లు వేస్తున్నారు. కానీ నీరు మాత్రం రావడం లేదు. బుధవారం సాయంత్రం రెండు బోర్లను మూసివేశారు. రెండో బోరుబావిని మూసివేద్దామనుకునేలోపు ఘటన జరిగింది.

కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన పద్మా..

కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన పద్మా..

ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బోరుబావిలో చిన్నారి పడ్డ విషయాన్ని పద్మా దేవేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అడిగారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో బోరుబావులను మూసివేయలేదా..? అని సీఎం కేసీఆర్ అడిగారు. అయితే అవి ఇటీవల వేసినవి అని.. వారు మూసివేస్తున్నారని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.

English summary
3 year old harshavardhan fell down to borewell in medak pudchanpalli village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X