హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగ ఇంటి చుట్టూ అన్ని కెమెరాలా?: ఎవరీ ఖాజం అలీ.., మామూలోడు కాదు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అతనో ఘరానా దొంగ. అతని గెటప్ మాత్రం ఓ ఎలక్ట్రికల్ ప్రొఫెషనల్‌లా ఉంటుంది. భుజానికి ల్యాప్ టాప్ బ్యాగ్, టిప్ టాప్ గెటప్ తో ఎవరికీ అనుమానం రాకుండా పట్టపగలే ఇళ్లల్లో సొత్తును కొల్లగొడుతుంటాడు. పలు నేరాల్లో నిందితుడైన ఖాజం అలీని గతంలో జైలుకు వచ్చినా ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓ చోరీ కేసులో తాజాగా అతన్ని అరెస్ట్ చేయగా.. మరిన్ని ఘరానా మోసాలు బయటపడ్డాయి.

ఎవరీ ఖాజం అలీ:

ఎవరీ ఖాజం అలీ:

టోలీచౌకీకి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ కుమారుడు ఖాజం అలీ. ఇతనో ప్రతిష్టాత్మక పబ్లిక్ స్కూల్లో చదివాడు. అయితే అక్కడ చదువుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం అతని జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది. స్కూల్ భవనంపై పతంగులు ఎగరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అలా రెండేళ్లు మంచానికి పరిమితమయ్యాడు. ఈ సమయంలోనే అతనికి చెడు వ్యసనాలు అలవాటు చేశారు స్నేహితులు.

వరుస చోరీలు:

వరుస చోరీలు:

గాయం నుంచి కోలుకున్న తర్వాత స్నేహితులతో కలిసి జల్సాలు చేయడానికి బాగా అలవాటుపడ్డాడు. ఇందుకోసం ఈజీ మనీకి అలవాటు పడి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. వరుస చోరీల కేసుల్లో ఏడాది పాటు జైల్లో ఉన్న అలీ 2016 జూన్‌ 28న బయటకు వచ్చాడు.

కానీ ఆ తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. 2016 సెప్టెంబర్‌ 6 -అక్టోబర్‌ 16 మధ్య కాలంలో దాదాపు 40 రోజుల్లో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 నేరాలు చేశాడు. 2009-2015 మధ్య కాలంలో హైదరాబాద్ తో పాటు, సైబరాబాద్, మెదక్‌ ల్లోని 17 పోలీసుస్టేషన్ల పరిధిలో 29 నేరాలకు పాల్పడ్డాడు.

ఇంటి చుట్టూ 32సీసీ కెమెరాలు:

ఇంటి చుట్టూ 32సీసీ కెమెరాలు:

ఖాజం అలీ తన ఇంటి చుట్టూ ఏర్పరుచుకున్న భద్రత గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ప్రస్తుతం టోలిచౌకిలోని సూర్యనగర్‌లో నివసిస్తున్న ఖాజం అలీ ఇల్లు ఒకప్పుడు అక్కడి ఫ్లైఓవర్‌ పక్కన ఉండేది. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో ఇతని కుటుంబానికి విభేదాలు కూడా ఉన్నాయి.

నయీమ్‌ నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఖాజం తన ఇంటి చుట్టూ 32సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే వీటిల్లో ఫీడ్‌ను రికార్డ్‌ చేయడానికి, లైవ్ లో చూడటానికి నాలుగు డీవీఆర్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఈ సీసీ కెమెరాలన్నింటిని అలాగే ఉంచాడు.

ఇలా పట్టుకున్నారు:

ఇలా పట్టుకున్నారు:


'పాపిల్లన్' అనే కొత్త సాఫ్ట్‌వేర్ తో అతని నేర చరిత్రను మరోసారి బయటకు తవ్వారు పోలీసులు. గతంలో ఖాజం పలుమార్లు అరెస్టయినప్పటికీ.. అతను వెల్లడించని చోరీ కేసులు చాలానే ఉన్నాయి.

ఎనిమిదేళ్ల క్రితం మలక్‌పేట, మంగళ్‌హాట్‌లో 180 తులాల బంగారం చోరీకి సంబంధించిన కేసుపై పోలీసులు తాజాగా దృష్టి సారించడంతో ఖాజం నేర చరిత్ర మరింత బయటపడింది. ఆ కేసులో దొరికిన నిందితుడి వేలిముద్రలు.. ఖాజం అలీ వేలిముద్రలతో సరిపోయాయి. పాపిల్లన్ సాఫ్ట్ వేర్‌తో నిందితుడిని గుర్తించడం సాధ్యపడింది. గతంలో నేరాలకు పాల్పడ్డ నేరస్తుల వేలిముద్రలు పాపిల్లన్ సాఫ్ట్ వేర్‌లో నిక్షిప్తం చేసి ఉంటాయి.

పెండింగ్ కేసులను విచారిస్తున్న క్రమంలో మలక్‌పేట, మంగళ్‌హాట్‌ కేసులను కూడా పరిశీలించడంతో ఖాజం అలీ దొంగతనాలు బయటపడ్డాయి. దీంతో మంగళవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

English summary
Police shocked after knowing there are 32 cc cameras around a thief house in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X