గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్, ఒకటి కాదు రెండు కాదు 371 సీసాలు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులను తగ్గించడం, సమయం కుదించడంతో సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి లిక్కర్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అందుకు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఇద్దరు బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తూ.. పోలీసులకు దొరికిపోయారు. అయితే 371 బాటిళ్లు దొరకడంతో అక్రమ మార్గంలో భారీగానే లిక్కర్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

మద్యం తీసుకెళ్లేందుకు అక్రమార్కులు విభిన్న పద్దతులను అనుసరిస్తున్నారు. వాటర్ క్యాన్లు, ఉల్లిపాయల సంచు, అంబులెన్స్‌, పశువుల గడ్డిమోపులో తరలిస్తున్నారు. తాజాగా బియ్యం బస్తాల్లో తరలించడంతో పోలీసులే నోరెళ్లబెట్టారు. తెలంగాణ రాష్రం నుంచి ముగ్గురు వ్యక్తులు టూ వీలర్స్‌పై బియ్యం బస్తాలను తీసుకెళ్తున్నారు. అందులో 80 కేజీల బియ్యంతోపాటు 37 బాటిల్స్ తీసుకెళ్తున్నారు.

371 liquor bottles in the rice bags, 2 arrested

Recommended Video

Another Bank Defaulter Flees Country, Basmati Rice Exporter Defaulting On rs 411 crore Loan

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి వస్తోన్న వారి వాహనాలను చూసి వత్సవాయి మండలం దబ్బాకుపల్లి డొంక రోడ్డు వద్ద నందిగామ సాండ్ మొబైల్ సిబ్బంది పట్టుకున్నారు. వారి బ్యాగులు చెక్ చేయగా.. అందులో మద్యం బాటిళ్లు కనిపించాయి. వీరు గుంటూరు జిల్లా నూకలపేట, అందుకూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి, బియ్యం, మద్యం బాటిళ్లు, టూ వీలర్స్ సీజ్ చేశారు.

English summary
371 liquor bottles in the rice bags, 2 arrested in krishna district police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X