తెలంగాణలో కొత్తగా 3801 కరోనా వైరస్ కేసులు: జీహెచ్ఎంసీలోనే అత్యధికం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 88,867 నమూనాలను పరీక్షించగా.. 3801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బాధితుల్లో 2046 మంది కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తంగా 3.16 కోట్ల పరీక్షలు నిర్వహించగా.. 7,47,155 మందికి పాజిటివ్ అని తేలింది.
ఇప్పటి వరకు వీరిలో 7,05,054 మంది కోలుకోగా, 4078 మంది మరణించారు. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 38,023కి పెరిగింది. మరోవైపు నిన్నటితో పోలిస్తే టెస్టులు, కేసులు కూడా తగ్గాయి. మంగళవారం 1.13 లక్షల నమూనాలను పరీక్షించగా.. 4559 మందికి కరోనా సోకింది.

గత 24 గంటల వ్యవధిలో జిల్లాల వారీగా కేసులు గమనించినట్లయితే... ఆదిలాబాద్ జిల్లాలో 43, భద్రాద్రి కొత్తగూడెం 78, జీహెచ్ఎంసీ 1570, జగిత్యాల 55, జనగాం 48, జయశంకర్ భూపాలపల్లి 29, జోగులాంబ గద్వాల 24, కామారెడ్డి 35, కరీంనగర్ 79, ఖమ్మం 139, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 17, మహబూబ్‌నగర్ 86, మహబూబాబాద్ 44, మంచిర్యాల 67, మెదక్ 27, మేడ్చల్ మల్కాజ్ గిరి 254, ములుగు 28, నాగర్ కర్నూలు 38, నల్గొండ 70, నారాయణపేట 25, నిర్మల్ 22, నిజామాబాద్ 62, పెద్దపల్లి 51, రాజన్న సిరిసిల్ల 31, రంగారెడ్డి 284, సంగారెడ్డి 88, సిద్ధిపేట 96, సూర్యాపేట 59, వికారాబాద్ 39, వనపర్తి 40, వరంగల్ రూరల్ 75, హన్మకొండ 147, యాదాద్రి భువనగిరి 51 కేసులు వెలుగుచూశాయి.
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్‌తో 665 మంది చనిపోయారు. నిన్న నమోదైన కేసులతో పోల్చితే 30,040 మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 22,23,018 యక్టీవ్ కేసులు ఉన్నాయి.
దేశంలో యాక్టివ్ కేసులు 5.55 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 16.16 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,00,85,116 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,91,127 మంది మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 93.23 శాతంగా ఉంది. మంగళవారం కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 3,73,70,971 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.