వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 నెలల బాలుడికి కరోనా వైరస్, ఉలిక్కపడ్డ కాలనీ, రాకపోకలు బంద్...

|
Google Oneindia TeluguNews

ఎలా సోకిందో తెలియదు.. కానీ నాలుగునెలల పసిగుడ్డుకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే వైద్యులు అక్కడికి చేరుకొని.. కాలనీ నుంచి రాకపోకలను నిలపివేశారు. సూర్యాపేట సమీపంలో కాసరబాద గ్రామానికి చెందిన చిన్నారికి వైరస్ వచ్చింది. వారు ఉంటోన్న కాలనీని అధికారులు బ్లాక్ చేశారు. చిన్నారి పేరంట్స్, బంధువులు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేస్తున్నారు.

4 months child have coronavirus positive

సదర మహిళ ఆత్మకూరు మండలం ఏఫూర్‌కు 4 నెలల క్రితం వెళ్లింది. అక్కడే డెలివరీ కాగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులతో ఆమె అత్తగారింటికి వచ్చింది. అయితే గత 15 రోజుల పిల్లవాడికి జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Recommended Video

VVS Laxman : 'Salute To Spirit Of Human Endurance & Strength'

నీలోఫర్ దవాఖానలో బాబుకు జ్వరం తగ్గకపోవడంతో కరోనా వైరస్ పరీక్ష చేశారు. అయితే అతనికి పాజిటివ్ ఉంది అని మంగళవారం రిపోర్ట్ వచ్చింది. దీంతో వెంటనే కాసరబాద చేరుకొని. కాలనీని బ్లాక్ చేశారు. రాకపోకలను నిలిపివేశారు. వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు తల్లిగారు ఊరు ఏపూర్ వద్ద కూడా కుటుంబసభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయబోతున్నారు. అక్కడ కూడా రోడ్లను బ్లాక్ చేసి వైరస్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే బాబుకి వైరస్ ఎక్కడ సోకిందనే అంశంపై స్పష్టత లేదు.

English summary
4 months child have coronavirus positive in suryapeta kasarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X