హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోల్డ్ స్మగ్లింగ్‌కు వాట్సప్ వాడేస్తున్నారు!: 4గురు స్మగ్లర్ల అరెస్ట్, రూ.16లక్షలు సీజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు జరిపి నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగున్నర కిలోల బంగారం, 16 లక్షల నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా, అక్రమ మార్గంలో బంగారాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న స్మగ్లర్లు వాట్సాప్‌ను ఆయుధంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు, హైదరాబాద్‌లో ఎవరిని కలవాలి?, తెచ్చిన బంగారం ఎవరికివ్వాలి?, దుబాయ్ నుంచి పంపిస్తున్నదెవరు? అనే వివరాలు, వారి ఫొటోలు వాట్సఫ్‌లో షేర్ చేసుకుంటున్నారు.

బుధవారం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన స్మగ్లింగ్ ముఠా మూడు నెలలుగా ఈ దందాను కొనసాగిస్తోంది. ఎక్కువ మొత్తంలో బంగారాన్ని తెచ్చే వారిపై నిఘా ఉంచడంతో ముఠా కొత్త దారులు ఎతుక్కుంటున్నాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు గురించి అక్కడి ఎయిర్‌పోర్టులో ఉంటూ వివరాలు సేకరిస్తారు. నిత్యం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు పదుల సంఖ్యలో ఉంటారు.

దుబాయ్‌కి వివిధ పనుల కోసం వెళ్లి అక్కడ కొన్నాళ్లుండి, తిరిగి హైదరాబాద్‌కు వచ్చే వారు ప్రతినిత్యం ఉంటారు. బంగారు బిస్కెట్లను తీసికెళ్లి ఎయిర్‌పోర్టులో ఉండే మా వాళ్లకు అందజేస్తే ఒక్కో బిస్కెట్‌కు రూ. 2 వేల నుంచి 5 వేల వరకు ఇస్తామంటూ ఒప్పందం చేసుకుంటారు. రెండు బిస్కెట్లు తెచ్చే వారికి రూ. 5 వేలకుపైగానే వస్తుండడంతో స్మగ్లింగ్‌కు కలిసి వస్తోంది.

దుబాయ్‌లోఒక సంవత్సరం ఉండే వారికి రెండు వందల గ్రాముల కంటే ఎక్కువగానే తీసుకువచ్చే వీలుంది.అవకాశంగా తీసుకొని హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులను గుర్తించి స్మగ్లింగ్ చేయిస్తున్నాయి.

దుబాయ్ ఎయిర్‌పోర్టులో వీరి ఒప్పందంతో బంగారాన్ని తెచ్చే వారి ఫొటోను తీసి వాట్సాప్‌లో హైదరాబాద్‌లో ఉండే వారికి పంపిస్తారు. వారి విమాన టికెట్టు, పాస్‌పోర్టు నెం, ప్రయాణికుడు ఫొటో హైదరాబాద్‌లో ఉండే వారికి వచ్చేస్తుంది. ప్రయాణికుడికి హైదరాబాద్‌లో బంగారాన్ని రీసివ్ చేసుకునే వారి ఫొటోను చూపించి, ఫోన్ నెంబర్‌ను కూడా పంపిస్తారు.

హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల పాస్‌పోర్టు, చిరునామా, వారి ఫోన్ నెంబర్ స్మగ్లింగ్ ముఠాలు తీసుకుంటుండడంతో వారు మోసం చేసే అవకాశం ఉండడం లేదు. ఇది ఈ ముఠాలు అవకాశంగా తీసుకొని దుబాయ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లోనే తిష్ట వేస్తున్నారు.

ఎయిర్ పోర్టులో ప్రయాణికులను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినట్లుగా నటిస్తూ వారిని తీసుకొని ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన తరువాత తమ బంగారాన్ని తీసేసుకుంటున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా మకాం వేసిందనే సమాచారం దక్షణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. నెల రోజులుగా ఈ మూఠా కోసం నిఘా పెట్టారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని సేకరించిన ఈ ముఠా విక్రయానికి సిద్ధమవుతూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.

స్మగ్లర్ అరీఫ్ అలీ షేక్

స్మగ్లర్ అరీఫ్ అలీ షేక్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు జరిపి నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

సిపి మహేందర్ రెడ్డి

సిపి మహేందర్ రెడ్డి

వీరి నుంచి నాలుగున్నర కిలోల బంగారం, 16 లక్షల నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

స్వాధీనం చేసుకున్న సొత్తు

కాగా, బంగారం విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బును దుబాయ్‌లో ఉండే వారికి హవాల మార్గంలోనే పంపిస్తున్నారు. బుధవారం పట్టుబడ్డ ఈ ముఠా వద్ద రూ. 16 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

స్వాధీనం చేసుకున్న సొత్తు

గతంలో విక్రయించిన బంగారానికి వచ్చిన డబ్బులను హవాల ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉంచారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

స్వాధీనం చేసుకున్న సొత్తు

బంగారం విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బును దుబాయ్‌లో ఉండే వారికి హవాల మార్గంలోనే పంపిస్తున్నారు.

స్మగ్లర్ జాఫర్ అహ్మద్

స్మగ్లర్ జాఫర్ అహ్మద్

బుధవారం పట్టుబడ్డ ఈ ముఠా వద్ద రూ. 16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లర్ సయ్యద్ వాజీద్

స్మగ్లర్ సయ్యద్ వాజీద్

గతంలో విక్రయించిన బంగారానికి వచ్చిన డబ్బులను హవాల ద్వారా పంపించేందుకు సిద్ధంగా ఉంచారు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

స్మగ్లర్ తహేరుద్దీన్

స్మగ్లర్ తహేరుద్దీన్

అక్రమ మార్గంలో బంగారాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న స్మగ్లర్లు వాట్సాప్‌ను ఆయుధంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

English summary
4 smugglers arrested in Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X