హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్నారిని హత్య చేసిన ఇంటిపై చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సంఘటన శనివార సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి లాస్య అనే చిన్నారి హత్యతో దీన్‌దయాళ్‌నగర్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

అసలు హత్యకు కారణాలేమిటనే విషయాన్ని ఆరా తీస్తే పక్కింటి మహిళ వివాహేతర సంబంధాన్ని చిన్నారి తల్లి నిలదీసిందనందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీన్‌దయాళ్‌నగర్‌లో నవీన్‌చారి, మయూరి దంపతులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వీరికి లాస్య (4)తో పాటు 3 నెలల బాబు ఉన్నాడు.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

వీరి ఇంటికి ఒకవైపు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగించే లక్ష్మయ్య, యాదమ్మ కుటుంబం నివాసముంటోంది. వీరికి కుమారుడు సహా కుమార్తె పద్మ (30) ఉన్నారు. పద్మ భర్త చనిపోవడంతో తలిదండ్రుల వద్దే ఉంటోంది. బాధిత కుటుంబం నివాసముంటున్న మరో వైపు ఇంటిలో బోరబండలో నివాసం ఉండే గిరి అనే వ్యక్తి నిర్మించుకున్నాడు.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

ఇదిలా ఉంటే కొంత కాలంగా పద్మతో గిరికి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరి వ్యవహారం లాస్య తల్లి మయూరి కంటపడింది. దీంతో మర్యాదస్తుల కుటుంబాలు నివాసముండే ఇక్కడ ఇటువంటి వ్యవహారాలేమిటంటూ నిలదీసింది.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దీంతో మయూరిపై కోపం పెంచుకున్న పద్మ కుటుంబ సభ్యులు, గిరి సహాయంతో ఎలాగైనా మయూరికి ప్రశాంతత లేకుండా చేయాలని పథకం పన్నాడు. ఇందుకు లక్ష్మయ్య కుటుంబ సభ్యులు తమ ఇంటి పక్కనే ఉండే నర్సయ్య, ఇందిరమ్మల సహాయం తీసుకున్నారు.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో బస్తీలో మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ చేపట్టారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లాస్య ఇంటి ముందటే ఆడుకుంటోంది. ఫాగింగ్ అయిపోయిన తరువాత యాదమ్మ లాస్య దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లింది.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

అప్పటికే ఇంట్లో ఉన్న వ్యక్తులచే లాస్యను మంచం కింద బలవంతంగా పడుకోబెట్టి దిండుతో ముఖంపై బలంగా అదిమి పిరాడనీయకుండా చేసి హత్య చేశారు. శవాన్ని ఇతర ప్రదేశానికి తరలిద్దామని అనుకునిఓ ప్లాస్టిక్ సంచిలో పెట్టారు. నిత్యం జనసమ్మర్ధంగా ఉంటుండడంతో శవాన్ని ముక్కలుగా కోసి తరలించాలని నిర్ణయించుకుని కత్తిపీటతో గొంతును కోశారు.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

వెంటనే శవాన్ని బ్యాగులో కట్టి వంటింట్లోని స్టవ్ పెట్టుకునే బండ కింద బియ్యం సంచి పక్కనే భద్రపర్చారు. మూడురోజుల పాటు లాస్య మృతదేహాన్ని భద్రపర్చేందుకు వీలుగా దుర్వాసన రాకుండా స్ప్రేలు చల్లారు పద్మ కుటుంబ సభ్యులు. ఎంతగాజనాల్లో కలిసి పాప గురించి వాకబు చేస్తున్నట్టు నటిస్తున్నా వారి పట్ల బస్తీలో కొంత మందికి అనుమానాలున్నాయి.

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

అయితే శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దుర్వాసన అధికం కావడంతో అందరికి అనుమానాలు తలెత్తాయి. బస్తీకి చెందిన పలువురు పద్మ ఇంటికి వచ్చి దుర్వాసన వస్తోందంటూ చెబుతుంటే అలాంటిదేమీ లేదంటూ వారిని పంపేశారు.

 దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

అయినా దుర్వాసన అదేవిధంగా వస్తుండడంతో తలుపులు తీయాలని లోపలికి వస్తామని చెబుతుంటే అర్ధగంట వరకు ఇంటి తలుపులు తీయకుండా గడియ పెట్టుకున్నారు. చివరికి చేసేది లేక తప్పని పరిస్ధితుల్లో తలుపులు తెరవడంతో విషయం వెలుగు చూసింది.

 దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

దిండుతో అదిమి.. కత్తిపీటతో గొంతు కోసి చంపేశారు

ఎనిమిదేళ్ళ పద్మ కుమారుడు, కుమార్తెలు జరిగిన విషయాన్ని, తమను బెదిరించిన తీరును బస్తీ వాసులకు తెలిపారు. దీంతో బస్తీవాసులు నిందితులపై దాడులకు దిగడంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారి లాస్యను హత్య చేసిన యాదమ్మ, పద్మ, గిరిలతో పాటు యాదమ్మ ఇంటి పక్కన ఉండే నర్సయ్యలపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Four year old baby who was missed four days back found murdered at Deendayal nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X