హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ కేసు: చార్జీషీట్లు దాఖలైనా ఇంకా ప్రారంభం కాని ట్రయల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై సిబిఐ దాఖలు చేసిన క్విడ్ ఫ్రో కో కేసులుపై చార్జీషీట్లు నాటుగు ఏళ్ళ క్రితం దాఖలు చేసినా...ట్రయల్ ఇంకా ప్రారంభం కాలేదు. ఎమ్మార్ , ఎపి ఐఐ సి టౌన్ షిప్ ల్లో అవకతవకలు చోటుచేసుకొన్నాయని సిబిఐ చార్జీషీటు దాఖలు చేసింది.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తనయుడు ప్రస్తుత ఎపి లో విపక్ష నాయకుడు జగన్ సంస్థల్లో పెట్టుబడులకు క్విడ్ కో ప్రో జరిగిందని సిబిఐ ఆరోపిస్తోంది.దీనికి సంబందిందిచి గతంలో కేసు దాఖలు చేసిన కాంగ్రెస్ , టిడిపి నాయకులు కూడ ఇదే అంశాలను ప్రస్తావించారు.

జగన్ సంబందించిన కేసుల్లో ఇప్పటికే 15 పిటిషన్లను పరిష్కరించారు. ఇంకా 12 పిటిసన్లు హైకోర్టులో , సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.అయితే ఈ కేసులనుండి తనను విముక్తి చేయాలని కోరడమో...లేదా ఈ కేసులకు తనకు సంబందం లేదని కొట్టివేయాలని కోరుతూ ఆయా కోర్టులను ఆశ్రయిస్తూ పిటిషన్లను ఉన్నాయి.

4 years later, trial yet to begin in top cases

2012 ఫిబ్రవరి లో ఎమ్మార్ కేసులో ఎపిఐఐసి కేసులో చార్జీషీటును సిబిఐ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో జగన్ ప్రమేయానికి సంబందించి అదే ఏడాది మార్చి 31న, చార్జీషీటును దాఖలైంది.11 కేసులకు సంబందించి క్విడ్ ప్రో కో ద్వారా జగన్ సంస్థల్లో పెట్టబడులు వచ్చాయనే అంశంపై 110 మంది పేర్లను చేర్చారు.వీరందిరినీ విచారించారు. అయినా ఆరోపణలను రుజువు చేయలేదు.ఈ కేసులకు సంబందించి చాల పిటిషన్లు ఉన్నత న్యాయస్థానాల్లో నిందుతుడు దాఖలు చేశారు. ఒకే కేసుకు సంబందించిన పిటిసన్లు ఉన్నత న్యాయస్థానంలో ఉండగా, అదే ఆరోపణలపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరపడంపై న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు కొందరు అధికారులు.

కేసుల నుండి విముక్తి పొందేందుకు తనకు ఉన్న అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొనే హాక్కు ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ కేసుల్లో సంబందమున్న ఐఎఎస్ అధికారులను విచారించేందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది.ఏ కేసుల్లోనైనా ఐఎఎస్ అధికారులను విచారణకు అనుమతి అవసరమనేది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఐఎఎస్ ఆపీసర్స్ కొందరు సిబిఐ తీరును కోర్టులో చాలెంజ్ చేశారు.

మరో వైపు సీనియర్ ఐఎఎస్ అధికారులు మన్మోహాన్ సింగ్ , మహాంతిలపై విచారణకు అనుమతివ్వాలని కోరుతూ సిబిఐ కేంద్రాన్ని కోరింది.దీనిపై కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది.

English summary
The actual trial into major Central Bureau of Investigation cases like AP Opposition leader Y.S. Jagan Mohan Reddy’s quid pro quo investments case and the Emaar APIIC township scam cases is yet to move ahead as the charges haven’t been framed yet, though the charge sheets were filed as long as four years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X