వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్బుతం: కరోనాను జయించిన 45 రోజుల బాలుడు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..దేశంలోనే చిన్న వయస్సు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం చిన్నపిల్లలు, వృద్దులపై ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఆడపా దడపా వృద్దులు, చిన్న పిల్లలు వైరస్‌తో పోరాడి జయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ చిన్నారి రక్కసిని ఓడించి.. కోలుకున్నాడు. బాబుకి వైరస్ లేకపోవడంతో వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తండ్రి ద్వారా పసిగుడ్డుకు వైరస్ సోకింది. వైరస్ సోకే సమయానికి చిన్నారి వయస్సు 20 రోజులు. దీంతో వెంటనే అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నెల 4వ తేదీన చిన్నారి ఆస్పత్రిలో చేరగా.. 29వ తేదీ బుధవారం పూర్తిగా కోలుకున్నారు. వైరస్ బారినుంచి కోలుకోవడంతో అతనిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

45-day-old Covid-19 positive baby stages full recovery, discharge..

కరోనా వైరస్ సోకి నయమైన అత్యంత చిన్న వయస్కునిగా చిన్నారి రికార్డు సృష్టించారు. గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది అందించిన చికిత్సతోనే చిన్నారి వేగంగా కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కరోనా వైరస్ రోగులకు వైద్య సిబ్బంది అహోరాత్రులు శ్రమించి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. వైద్య సిబ్బంది చలువతోనే వైరస్ బారినపడ్డ వారు కూడా కోలుకుంటున్నారని తెలిపారు.

కరోనా వైరస్‌కు చికిత్స తీసుకొని, కోలుకోవడంతో బుధవారం 35 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే వారిలో 13 మంది చిన్నారులు ఉండటం విశేషం. మరో 10 మంది చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.

Recommended Video

AP Lockdown Relaxations Guidelines || కరోనా లక్షణాలు లేకపోతేనే ఈ మినహాయింపులు...!!

English summary
45-day-old baby boy, who tested positive for Covid-19 when he was 20-days-old, was discharged from a state-run hospital here on Wednesday after his full recovery in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X