తెలంగాణలో తగ్గని కరోనా విలయం.. కొత్తగా 4, 559 కేసులు ... జీహెచ్ఎంసీలో వైరస్ పంజా
తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేసుల సంఖ్య మళ్ళీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,559 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 36,269కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో దాదాపు సగం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే వెలుగుచూశాయి.

పెరిగి కరోనా కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా పంజా విసురుతుంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో మొత్తం 1,13,670 శాంపిల్స్ పరీక్షించగా .. 4,559 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 36,269కి చేరింది. 1961 మంది వైరస్ బారినుంచి కొలుకున్నారు. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 94.57 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో వైరస్ పంజా
జీహెచ్ఎంసీలో కరోనా విలయతాండం చేస్తోంది. వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 1450 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ -రంగారెడ్డి జిల్లా పరిధిలో 432, రంగారెడ్డి 332, హనుమకొండ 201, ఖమ్మం 145, నల్గొండ 138 , కరీంనగర్ 112 మందికి పాజిటివ్ గానిర్థారణ అయింది.

కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక
అటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డి. శ్రీనివాస్ రావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించేంత తీవ్రతతో కరోనా కేసులు లేవని తెలిపింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని వెల్లడించింది . రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డి హెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏ ఇంట్లో చూసినా అనారోగ్యంతో బాధపడుతున్న వారే దర్శనమిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యపరిస్థితిపై వివరాలను సేకరించి, వారికి అనారోగ్యం ఉన్నట్లయితే సంబంధిత మందుల కిట్లను అక్కడికక్కడే అందజేసి వారిని హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.