తెలంగాణలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు: కొత్తగా 485 కేసులు, హైదరాబాద్లోనే అధికం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 27,130 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 485 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుల చేసింది.
తెలంగాణలో ఇప్పటి వరకు 8,00,476 కరోనా కేసులు నమోదు కాగా, 7,91,944 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 4111 మంది మరణించారు. హైదరాబాద్లో కొత్తగా 257 మంది కరోనా బారిన పడగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, సంగారెడ్డిలో 73, రంగారెడ్డి జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4421 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

దేశంలోనూ పెరిగిన కరోనా కేసులు
దేశంలో సోమవారం తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14,506 మంది వైరస్ బారినపడగా.. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. ఇది 98.56 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.23 శాతం వద్ద ఉంది.
ఇప్పటి
వరకు
నమోదైన
మొత్తం
కరోనా
కేసులు
4,34,33,345
కాగా,
మొత్తం
మరణాలు
సంఖ్య
5,25,077కు
పెరిగింది.
దేశంలో
ప్రస్తుతం
యాక్టివ్
కేసులు
99,602కు
పెరిగాయి.
కోలుకున్నవారి
సంఖ్య
4,28,08,666కు
చేరింది.
మరోవైపు,
దేశంలో
మంగళవారం
13,44,788
మందికి
టీకాలు
అందించగా..
ఇప్పటివరకు
పంపిణీ
చేసిన
వ్యాక్సిన్
డోసుల
సంఖ్య
1,97,46,57,138
కోట్లకు
చేరింది.