హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పసిగట్టేస్తాయి: మంత్రి నాయినికి స్నిఫ్ఫర్ డాగ్స్ వందనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాంతి భద్రతలే పరమావధిగా పనిచేస్తున్న పోలీసులతో సమానంగా నేరస్థులను పట్టుకోవడంలో పోలీసు జాగిలాలు కీలకమయ్యాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రజల భద్రతలో పోలీస్ సిబ్బందికి ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్న జాగిలాల ప్రత్యేకత విశ్వాసంతో కూడుకున్నదని పేర్కొన్నారు.

ఉగ్రవాదం, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని, పోలీసులు వాటిని ఎంతో ధైర్యసాహసాలతో ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్ అకాడమీలో గురువారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయనతో పాటు డిజిపి అనురాగ్ శర్మ, ఇంటెలిజన్స్ ఐజి శివధర్‌రెడ్డి, సెక్యూరిటీ ఐజి మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ, 2004లో ప్రారంభమైన ఈ అకాడమీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు పోలీసు జాగిలాలకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

శాంతి భద్రతలే పరమావధిగా పనిచేస్తున్న పోలీసులతో సమానంగా నేరస్థులను పట్టుకోవడంలో పోలీసు జాగిలాలు కీలకమయ్యాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ప్రజల భద్రతలో పోలీస్ సిబ్బందికి ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తున్న జాగిలాల ప్రత్యేకత విశ్వాసంతో కూడుకున్నదని పేర్కొన్నారు.

నాయినికి స్నిఫ్ఫర్ డాగ్ సెల్యూట్

నాయినికి స్నిఫ్ఫర్ డాగ్ సెల్యూట్

ఉగ్రవాదం, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు దేశానికి ప్రమాదకరంగా మారాయని, పోలీసులు వాటిని ఎంతో ధైర్యసాహసాలతో ఎదుర్కొంటున్నారని అన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఇంటిగ్రేటెడ్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్ అకాడమీలో గురువారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయనతో పాటు డిజిపి అనురాగ్ శర్మ, ఇంటెలిజన్స్ ఐజి శివధర్‌రెడ్డి, సెక్యూరిటీ ఐజి మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ, 2004లో ప్రారంభమైన ఈ అకాడమీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులతో పాటు పోలీసు జాగిలాలకు కూడా శిక్షణ ఇవ్వడంజరుగుతోందన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీసు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, ఆధునిక టెక్నాలజీతో శిక్షణ, వాహనాలు సమకూర్చడం జరిగిందన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ప్రభుత్వం పేదల కోసం అమలు జరుపుతున్న డబుల్ బెడ్‌రూమ్ పథకంలో పోలీసులకు కూడా పదిశాతం కేటాయిస్తున్నామని, ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 30శాతం భత్యం ఇస్తున్నట్టు తెలిపారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లనుంచే కాకుండా పోలీసు శాఖలోని విభాగాలైన సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ ఆక్టోపస్ విభాగాల కోసం కూడా కేటాయించిన జాగిలాలకు మన రాష్ట్ర అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఇంటెలిజెన్స్ విభాగం ఐజి శివధర్ రెడ్డి మాట్లాడుతూ, 78ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ప్రస్తుత సెక్యూరిటీ అకాడమీ ద్వారా 363 జాగిలాలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చామన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఈ సందర్భంగా జాగిలాలతో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

మంటల్లోంచి దూకడం, వాహనం పైనుంచి ఒక్కసారిగా దూకి దుండగులను పట్టుకోవడం, నేరస్థులపైకి దూకి వారిని కదలకుండా చేయడం, యజమాని చెప్పినట్టు చేయడం వంటి విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఈ సందర్భంగా ఉగ్రవాదులను ఎదుర్కొనడంలో ప్రతిభ కనబరచిన జర్మన్ షెపర్డ్‌కు, నల్గొండ జిల్లాకు కేటాయించిన పింక్ అనే జాగిలానికి, తిరుపతి అర్బన్‌కు చెందిన డాబర్‌మన్ జాతి బ్రౌనీ శునకానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ట్రోఫీలు బహూకరించారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

అదేవిధంగా పేలుడు పదార్థాలు, ఉగ్రవాదులను ఎదుర్కొనడం, మత్తు, మాదకద్రవ్యాలను పసిగట్టడం వంటి అంశాలలో ఎంపికైన జాగిలాలకు మంత్రి ట్రోఫీలను అందజేశారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఈ సమావేశంలో కమీషనర్లు ఎం మహేందర్‌రెడ్డి, సివి ఆనంద్, అదనపు డిజిపిలు సుదీప్ లక్తకియ, సత్యనారాయణ, కృష్ణప్రసాద్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ప్రభుత్వం పేదల కోసం అమలు జరుపుతున్న డబుల్ బెడ్‌రూమ్ పథకంలో పోలీసులకు కూడా పదిశాతం కేటాయిస్తున్నామని, ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 30శాతం భత్యం ఇస్తున్నట్టు తెలిపారు.

పాసింగ్ ఔట్ పరేడ్

పాసింగ్ ఔట్ పరేడ్

ఈ సందర్భంగా జాగిలాలతో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీసు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, ఆధునిక టెక్నాలజీతో శిక్షణ, వాహనాలు సమకూర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వం పేదల కోసం అమలు జరుపుతున్న డబుల్ బెడ్‌రూమ్ పథకంలో పోలీసులకు కూడా పదిశాతం కేటాయిస్తున్నామని, ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 30శాతం భత్యం ఇస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా జాగిలాలతో నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ చూసి సందర్శకులు ఆశ్చర్యపోయారు. మంటల్లోంచి దూకడం, వాహనం పైనుంచి ఒక్కసారిగా దూకి దుండగులను పట్టుకోవడం, నేరస్థులపైకి దూకి వారిని కదలకుండా చేయడం, యజమాని చెప్పినట్టు చేయడం వంటి విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఈ సందర్భంగా ఉగ్రవాదులను ఎదుర్కొనడంలో ప్రతిభ కనబరచిన జర్మన్ షెపర్డ్‌కు, నల్గొండ జిల్లాకు కేటాయించిన పింక్ అనే జాగిలానికి, తిరుపతి అర్బన్‌కు చెందిన డాబర్‌మన్ జాతి బ్రౌనీ శునకానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ట్రోఫీలు బహూకరించారు.

ఆకట్టుకున్న పాసింగ్ ఔట్ పరేడ్: మంత్రి నాయినికి స్నిఫ్ఫర్ డాగ్స్ వందనం

English summary
49 Sniffer Dogs Passing Out Parade Held In Moinabad, Home Minister Naini Naini Narsimha Reddy Attended this programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X