హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లా భువనగిరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం భువనగిరి పట్టణంలో సంచలనం రేపింది. అనారోగ్యం, జీవనం కొనసాగించలేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... సంచార తెగకు చెందిన అంకోసి రమేష్‌(40) తల్లితో పాటు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పట్టణ ప్రజల్ని కలవరానికి గురిచేసింది. రమేష్‌ కుటుంబం చిరు వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో కొన్నేళ్లుగా గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది.

 పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

శుక్రవారం రాత్రి రమేష్‌ ఊరెళ్లుతున్నామని బంధువులకు చెప్పి తల్లి, ముగ్గురు కుమార్తెలతో కలసి అక్కడి నుంచి బయలు దేరారు. నేరుగా పట్టణ శివారు హన్మాపురం రైల్వే గేటు సమీపంలోని తుక్కాపురం సంజీవరెడ్డి భూమికి చేరుకున్నారు.

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

వెంట తెచ్చుకున్న అరటి పండ్లు.. మిఠాయిలు.. శీతలపానీయం... తమకు మృత్యుకుహరంలోకి నెడుతుందన్న విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. రమేష్‌ ఇచ్చినవన్నీ ఆనందంతో తిన్నారే తప్ప అందులో విషం ఉందని చిన్నారులు, వయసు మీదపడిన తల్లి గుర్తించలేకపోయారు.

 పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

అనారోగ్యం, కుటుంబ పోషణ భారంగా మారడం, ఒంటరి తనంతోనే కుటుంబ సభ్యులతో కలిసి రమేష్‌ ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది రమేష్ భార్య అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.

 పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

సంఘటన స్థలంలో రమేష్‌(40), పద్మమ్మ(70), స్వరూప(8), కావేరి(5), నందిని(4) విగతజీవులై పడి ఉండటాన్ని గుర్తించిన పాల వ్యాపారి వార్డు కౌన్సిలర్‌ గోమారి సుధాకర్‌రెడ్డికి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

 పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

ఎస్ఐ శంకర్‌గౌడ్‌ ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ మోహన్‌రెడ్డి బాధితుల బంధువులతో వివరాలు అడిగి తెల్సుకున్నారు. ఘటన స్థలిలో లభ్యమైన వస్తువులను పరిశీలించారు. పోస్టుమార్టంలో ఆత్మహత్య కారణాలు బయటపడతాయని, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పోషించలేకనే: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

కాగా, శుక్రవారం సాయంత్రం తన తల్లితో పాటు ముగ్గురు కుమార్తెలను తీసుకుని ఊరికి వెళ్తున్నట్టు మేనల్లుడు గంగారామ్‌కు చెప్పారు. ఇలా జరగడంతో గంగారామ్‌ కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.

English summary
In a tragic incident on Bhongir outskirts in Nalgonda district, five members of a wanderer family including three children committed suicide by consuming food and drinks laced with poison. This shocking incident came to light on Saturday morning. The deceased have been identified as Ramesh (40), his mother Padma (70) and daughters Nandini (3), Kaveri (5) and Swaroopa (8).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X