హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం, తొలుత శంషాబాద్‌కు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో భాగంగా 40 బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటోంది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐదు ఎలక్ట్రిక్ బస్సులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రారంభించారు.

కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, మొదటి దశలో శంషాబాద్ విమానాశ్రయానికి నడుపుతామని తెలిపారు.

5 electric buses to hit Hyderabad roads

ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టాలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి హానీ కలిగించని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ప్రస్తుత ఏసీ బస్సుల మాదిరిగానే వీటిని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం ఐదు ఎలక్ట్రిక్ బస్సులో అందుబాటులోకి వచ్చాయి. ఒక్కసారి సరిపడినంతా ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు. ఒక కిలోమీటర్‌కు ఒక యూనిట్ చొప్పున కరెంట్ ఖర్చు అవుతుంది.

English summary
5 electric buses to hit Hyderabad roads. IAS Officers Ajay Mishra, Arvind Kumar Inaugurate RTC Buses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X