సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరోసారి: సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలిస్తే జాతీయ రికార్డ్, కీలక నేతల రికార్డులు ఇవీ

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు సిద్దిపేట నుంచి మరోసారి గెలిస్తే జాతీయస్థాయిలో రికార్డ్ సృష్టించనున్నారు! ఆయన ఈసారి గెలిస్తే వరుసగా ఆరోసారి విజయం సాధించినట్లు. ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన ఆయన, కేవలం 14 ఏళ్ల వ్యవధిలోనే ఆరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే రికార్డే.

<strong>ఆంధ్రావాళ్లూ! తెలంగాణవాళ్లమని చెప్పుకోండి, మీకు చంద్రబాబే శని, సిగ్గు బుద్ధి రాలేదు: కేసీఆర్</strong>ఆంధ్రావాళ్లూ! తెలంగాణవాళ్లమని చెప్పుకోండి, మీకు చంద్రబాబే శని, సిగ్గు బుద్ధి రాలేదు: కేసీఆర్

తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆయన రెండుసార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన మొదటి నుంచి సిద్దిపేట నుంచే గెలుస్తున్నారు. మెజార్టీలో రికార్డులు సృష్టిస్తున్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా అవడంతో గతంలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి హరీష్ పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన హరీష్ రావు

ఇప్పటికే ఐదుసార్లు గెలిచిన హరీష్ రావు

2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యాక రాజీనామా చేయడంతో హరీష్ పోటీ చేసి, గెలిచారు. నాడు హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనను తన కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి హరీష్ వరుసగా 5సార్లు గెలిచారు.

ఐదుసార్లు హరీష్ రావు ఇలా గెలిచారు

ఐదుసార్లు హరీష్ రావు ఇలా గెలిచారు

2004 ఉప ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో, 2009 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. 2018లో ఆయన మరోసారి గెలుస్తారని ధీమాగా ఉన్నారు. ఈసారి కూడా గెలిస్తే హరీష్ రావు రికార్డ్ సృష్టించనున్నారు. ఒకటి 14 ఏళ్ల వ్యవధిలో ఆరుసార్లు గెలవడం. మరొక కీలకమైన రికార్డ్ ఉంది. 46 ఏళ్లకే ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి జాతీయస్థాయి రికార్డ్ సృష్టించనున్నారు.

తెలంగాణలో ఆరుసార్లు గెలిచిన వారు ఇలా

తెలంగాణలో ఆరుసార్లు గెలిచిన వారు ఇలా

గతంలో తెలంగాణకు చెందిన నేతలు బాగారెడ్డి (కాంగ్రెస్) - జహీరాబాద్ నుంచి, జానారెడ్డి (కాంగ్రెస్) నాగార్జున సాగర్ నుంచి, కే చంద్రశేఖర రావు (టీఆర్ఎస్) సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు గెలిచారు.బాగారెడ్డి 53, జానారెడ్డి 63, కేసీఆర్ 50 ఏళ్ల వయస్సుల్లో ఆరోసారి గెలిచారు. కేసీఆర్ సిద్దిపేట నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. కానీ అంతకుముందు, 1983లో తొలిసారి ఓడిపోయారు.

జాతీయస్థాయిలో నేతలు ఇలా

జాతీయస్థాయిలో నేతలు ఇలా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 60 ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా ఉన్నారు. కరుణానిధి 1980లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయన వయస్సు 56. కేరళకు చెందిన కేఎం మణి 1982లో 49 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచారు. 23 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న జ్యోతిబసు 11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 56 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు. గణపతిరావు దేశ్‌ముఖ్ మహారాష్ట్ర నుంచి 11సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన 50 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు. మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుంచి తొమ్మిదిసార్లు గెలిచారు. 1972 నుంచి 2009 వరకు గెలిచారు. ఇతను 52 ఏళ్ల వయస్సులో ఆరోసారి గెలిచారు.

English summary
If voted to power, Harish Rao will create national record by becoming MLA for the sixth time at the age of 46 from a single constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X