వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 మందికి తగ్గిన కరోనా: తీసుకెళ్లేందుకు రానీ ఫ్యామిలీస్, గాంధీలోనే రీ-అడ్మిట్, సిటీలో 2192 మంది..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సోకి ఆరోగ్యం మెరుగుపడ్డ 93 ఏళ్ల బామ్మ గురించి ఇటీవలే వార్త చదివాం కదా. అయితే ఆమెకు మరోసారి పరీక్షలు చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ చేయమని గాంధీ ఆస్పత్రి సిబ్బంది స్పష్టంచేయడంతో వివాదం చెలరేగింది. చివరికి ఆమె మరికొద్దిరోజుల్లో ఆస్పత్రిలో ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెలా మరికొందరు ఉన్నారని అప్పట్లోనే వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ సంఖ్య స్పష్టత వచ్చింది. అలా 50 మంది వరకు ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. వారికి మరోసారి పరీక్ష చేయాలని కొందరు, తమ ఇంటి వద్ద ప్రత్యేక గది సదుపాయం లేదు అని కొందరు తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక మరో 14 రోజులపాటు హోం క్వారంటైన్ వసతి కల్పిస్తున్నారు.

కరోనా బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే: మంత్రి కుటుంబ సభ్యుల్లోనూ: హోమ్ క్వారంటైన్‌: ఆందోళనలోకరోనా బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే: మంత్రి కుటుంబ సభ్యుల్లోనూ: హోమ్ క్వారంటైన్‌: ఆందోళనలో

ఫోన్ చేస్తే నో ఆన్సర్

ఫోన్ చేస్తే నో ఆన్సర్

వాస్తవానికి వారికి వైరస్ తగ్గడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకోసం కొందరు ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయడం లేదు అని సిబ్బంది చెబుతున్నారు. మరికొందరు తమ వాళ్లు వస్తారని ఆశగా ఎదురుచూసి.. గేటు వద్దే నిరీక్షిస్తున్నారు. ఎంతకీ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంతో తిరిగి ఆస్పత్రిలో చేరుతున్నారు. అలా ఇప్పటివరకు 50 మంది వరకు తిరిగి ఆస్పత్రిలో చేరారని గాంధీ వైద్యులు తెలిపారు. వీరంతా గత 10-15 రోజుల్లోనే వ్యాధి నయమైందని.. కానీ వారిని తీసుకెళ్లేందుకు రాక ఇక్కడే ఉండిపోయారు.

హోం క్వారంటైన్..

హోం క్వారంటైన్..

50 మంది వరకు ఆరోగ్యంగా ఉన్నారని, కరోనా వైరస్ లక్షణాలు లేవు అని గాంధీ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. వారు హోం క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందన్నారు. మరికొందరు అయితే మరోసారి పరీక్ష చేయాలని కోరుతున్నారని.. నెగిటివ్ వస్తే తప్పకుండా తీసుకెళతామని చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రోగికి వైరస్ తగ్గాక మరోసారి పరీక్షలు చేయరని.. ఆ నిబంధనల మేరకు తాము నడుచుకుంటున్నామని తెలిపారు.

వైరస్ వస్తుందని...?

వైరస్ వస్తుందని...?

సదరు రోగికి వైరస్ తగ్గినా.. కుటుంబసభ్యులు మాత్రం అనుమానపడుతున్నారు. వారిని తీసుకెళితే తమకు ఎక్కడ వైరస్ అంటుకుంటుదేమోనని భయపడుతున్నారని గాంధీ మరో వైద్యుడు తెలిపారు. అందుకోసమే సొంత పేరంట్స్‌ను కూడా తీసుకెళ్లేందుకు వెనకాడుతున్నారని వివరించారు. ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్లకపోవడంతో కొందరినీ గాంధీలో బెడ్స్ ఏర్పాటు చేసి ఉంచామని, మరికొందరినీ నేచర్ క్యూర్ ఆస్పత్రి క్వారంటైన్ కేంద్రానికి తరలించామని తెలిపారు.

Recommended Video

Bihar Lightning : పిడుగుల వానతో ఏకంగా 83 మంది మృతి, పెను విషాదం...!! || Oneindia Telugu
పెరుగుతున్న రోగుల వల్ల..

పెరుగుతున్న రోగుల వల్ల..

వాస్తవానికి గాంధీ ఆస్పత్రికలో వైరస్ సోకిన రోగులు ఎక్కువగా వస్తున్నారు. దీంతో తిరిగి పరీక్షలు నిర్వహించడం వీలుకావడం లేదు. ఈ సమయంలో 50 మంది వరకు తిరిగి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. గ్రేటర్ పరిధిలో 2 వేల 192 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. రోగికి వైరస్ తగ్గాక భయపడొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు.

English summary
50 members: family members of over 50 people who were being treated in the state’s Covid-exclusive hospital refused to take them back even after they were ready to be discharged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X