వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

JEE మెయిన్స్ లో... తెలంగాణ గురుకుల విద్యార్థులు రికార్డ్ || Oneindia Telugu

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. విజయం తప్పక వరిస్తుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు తెలంగాణా రాష్ట్రంలోని గురుకులాల్లో చదివిన విద్యార్థులు . కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా అనూహ్యంగా జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచారు. రికార్డు సృష్టించారు.

<strong>వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశం </strong>వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస రెడ్డి .. 14 రోజుల రిమాండ్ .. నేడు కస్టడీ పిటీషన్ వేసే అవకాశం

జేఈఈ-2019 మెయిన్స్‌లో తెలంగాణ సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

జేఈఈ-2019 మెయిన్స్‌లో తెలంగాణ సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

జేఈఈ-2019 మెయిన్స్‌లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 506 మంది విద్యార్థులు పాత రికార్డులను తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారు. తెలంగాణా ఖ్యాతి నలుదిక్కులా విస్తరింపజేసేలా విద్యార్ధులు జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు .

506 మంది గురుకులాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణత

506 మంది గురుకులాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణత

జేఈఈ చరిత్రలోనే తొలిసారి తెలంగాణ విద్యార్ధులు 506మంది జేఈఈ-2019 మెయిన్స్‌లో ఉత్తీర్ణులు అయ్యారు. ఎస్సీ సంక్షేమ గురుకులాల నుంచి 307 మంది, ఎస్టీ సంక్షేమ గురుకులాల నుంచి 199 మంది విద్యార్థులు మే 27న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరిక్షకు అర్హత సాధించారు.రజనీకేశ్ వర్ధన్ (98.4%), కొర్రా మహేష్(95.3%), తేజస్విని (93.4%), ప్రియసన్ (93.62%) లు టాపర్లుగా నిలిచారు. బీసీ గురుకులాల పరిధిలో 44 మంది అర్హత పొందగా వీరిలో 31 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు.

 కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ గురుకుల విద్యార్ధుల సత్తా

కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ గురుకుల విద్యార్ధుల సత్తా

పోటీ పరీక్షల్లో ర్యాంకులు ఏవైనా కేవలం కార్పోరేట్ కళాశాలలకే వస్తాయి అన్న భావనను ఈ ఫలితాలు పూర్తిగా తుడిచి పెట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు సైతం సత్తా చాటగలరని నిరూపించాయి ఈ ఫలితాలు. జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు అయిన విద్యార్ధుల తల్లిదండ్రులు మెజారిటీగా కూలీలు, రైతుల పిల్లలు కావడం విశేషం. వారి నేపధ్యం అంతా గ్రామాలతోనే ముడిపడి ఉంది. కార్పోరేట్ వసతులు లేకపోయినా కార్పోరేట్ కాలేజీ విద్యార్ధులకు ధీటుగా వీరు ర్యాంకులు సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు విద్యార్థులు తాము ర్యాంకులు సాధించటంలో అధ్యాపకుల కృషి ఎంతో ఉందని చెప్తున్నారు.

English summary
Students from Telangana Social and Tribal Welfare Residential Educational Institutions Societies have proved this by clearing the JEE Main 2019. 506 students from Telangana Residential Institutions cracked the Joint Entrance Examination (Mains) 2019.Of the 506 students, 307 are from social welfare residential institutions and 199 belong to the tribal welfare institutions. Run by the state government, these institutions are residential colleges providing education to underprivileged students hailing from the SC and ST communities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X