హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంధువని ఇంట్లోకి రానిస్తే! గొంతుకోసి నగల చోరీ: 13గంటల్లో 6చైన్ స్నాచింగ్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంధువని ఇంట్లోకి రానిస్తే.. మహిళ గొంతుకోసి నగలు దోచుకెళ్లాడో దుర్మార్గుడు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగోలు సమీపంలోని రాజ్యలక్ష్మీకాలనీకి చెందిన సువర్ణ (60) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇటీవల ఆమె భర్త మరణించగా, కుమారుడు దినేష్‌రెడ్డి, కోడలు శిరీషతో కలిసి ఉంటోంది.

కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తుండడంతో మనవరాలు బాగోగులు చూసుకునేందుకు గత కొంతకాలంగా సెలవుపెట్టి ఇంట్లోనే ఉంటోంది. కాగా, గురువారం మధ్యాహ్నం ఆమెకు కోడలు ఫోను చేసి తనకు వరుసకు సోదరుడైన శ్యామ్‌ అలియాస్‌ కుమార్‌(28) ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడని.. వాటిని కొనాలని బతిమిలాడితే ఇంట్లో ఇవ్వాలని చెప్పింది. అంతేగాక, వరంగల్‌కు చెందిన అతడు వస్తే పుస్తకాలు తీసుకుని డబ్బులు ఇవ్వాలని చెప్పింది.

ఆ తర్వాత శ్యామ్‌ ఇంటికి రావడంతో లోనికి పిలిచి బంధువని భోజనం కూడా పెట్టింది సువర్ణ. అనంతరం అతడు కత్తి చూపి.. నగలు ఇవ్వాలని బెదిరించాడు. దిండును ముఖానికి అదిమిపెట్టి.. నాలుగు బంగారు గాజులు, బంగారు గొలుసు లాక్కున్నాడు. విషయం అందరికీ చెబుతుందని భావించి ఆమె గొంతును కత్తితో కోశాడు.

కడుపులో పొడవబోతుండగా... చేతులు అడ్డుపెట్టడంతో ఆమె వేళ్లుతెగిపోయాయి. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు పడిపోవడంతో చనిపోయిందనుకుని తలుపులు గొళ్లెం వేసి పరారయ్యాడు. కొద్దిసేపటికి మనవరాలి ఏడుపుతో స్పృహలోకి వచ్చిన తలుపు గట్టిగా బాదడంతో ఇంటి యజమాని వచ్చి తెరిచాడు.

గాయాలతో ఉన్న ఆమె నాగోలులోని ప్రైవేలు ఆస్పత్రిలో చేర్పించడంతో అత్యవసర విభాగంలో చికిత్సపొందుతోంది. బాధితురాలి కుమారుడి ఫిర్యాదుతో ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

13 గంటలు.. ఆరు చోరీలు: సీసీ కెమెరాలకు చిక్కిన చైన్‌స్నాచర్లు

హైదరాబాద్‌ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. కేవలం 13గంటల వ్యవధిలో ఆరు చోరీలకు పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం 5గంటలకు సరూర్‌నగర్‌లో ప్రారంభమైన దొంగల స్వైరవిహారం.. గురువారం ఉదయం 6 గంటలకు తుకారాంగేట్‌ వరకు సాగింది. ఉత్తర మండలం పరిధిలోనే 4చోరీలకు పాల్పడటంతో ఆ జోన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

పలుప్రాంతాల్లో గురువారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల చిత్రాలను పోలీసులు సంపాదించారు. దొంగతనాలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న పలు కెమెరాల్లో నిందితులు ఎర్ర రంగు పల్సర్‌ వాహనంపై ప్రయాణిస్తూ కనిపించారు.

వీరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవారియా ముఠాసభ్యులుగా అనుమానిస్తున్నారు. నేరగాళ్లు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే అయి ఉండవచ్చనే కోణంలో ఆరా తీస్తున్నామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి తెలిపారు.

మహిళ గొంతుగోసిదితడే

మహిళ గొంతుగోసిదితడే

బంధువని ఇంట్లోకి రానిస్తే.. మహిళ గొంతుకోసి నగలు దోచుకెళ్లాడో దుర్మార్గుడు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగోలు సమీపంలోని రాజ్యలక్ష్మీకాలనీకి చెందిన సువర్ణ (60) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

బాధితురాలు

బాధితురాలు

గురువారం మధ్యాహ్నం ఆమెకు కోడలు ఫోను చేసి తనకు వరుసకు సోదరుడైన శ్యామ్‌ అలియాస్‌ కుమార్‌(28) ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడని.. వాటిని కొనాలని బతిమిలాడితే ఇంట్లో ఇవ్వాలని చెప్పాననీ.. వరంగల్‌కు చెందిన అతడు వస్తే పుస్తకాలు తీసుకుని డబ్బులు ఇవ్వాలని చెప్పింది.

చైన్ స్నాచర్లు

చైన్ స్నాచర్లు

హైదరాబాద్‌ నగరంలో గొలుసు దొంగలు మరోసారి పంజా విసిరారు. 13గంటల వ్యవధిలో ఆరు చోరీలకు పాల్పడ్డారు.

చైన్ స్నాచర్లు

చైన్ స్నాచర్లు

బుధవారం సాయంత్రం 5గంటలకు సరూర్‌నగర్‌లో ప్రారంభమైన దొంగల స్వైరవిహారం.. గురువారం ఉదయం 6 గంటలకు తుకారాంగేట్‌ వరకు సాగింది. ఉత్తర మండలం పరిధిలోనే 4చోరీలకు పాల్పడటంతో ఆ జోన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.

English summary
A bike-borne duo, less than 24 hours and six chains snatched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X