వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో భారీ బౌద్ద స్థూపం

|
Google Oneindia TeluguNews

దేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ స్థూపాన్ని హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ మ్యూజియంలో భద్రపరిచారు.కాగా బుద్దిడి విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి మరిన్ని తవ్వకాలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తుందని అన్నారు.

 ఫణిగిరిలో ఆరు అడుగుల బుద్దుడు

ఫణిగిరిలో ఆరు అడుగుల బుద్దుడు

సూర్యపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ద స్తూప క్రేంద్రమైన ఫణిగిరి లో డంగు సున్నంతో చేసి ఓ అరు ఆడుగుల బుద్దిడి విగ్రహం వెలుగుచూసింది. ఫణిగిరి బౌద్ద స్తూపం ప్రాంగణంలో గత రెండు మూడు నెలలుగా కేంద్ర పురావస్తూ శాఖ అనుమతి తో రాష్ట్ర పురావస్తూ శాఖ తవ్వకాలను ప్రారంభించింది. ఈ తవ్వకాల క్రమములో ఆరు అడుగుల అద్బుత ప్రతిమ బయల్పడింది. ఈ భారీ ప్రతిమను హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ మ్యూజియంలో భద్రపరిచారు.

అమూల్యమైన ప్రతిమ : మంత్రి శ్రీనివాస గౌడ్

అమూల్యమైన ప్రతిమ : మంత్రి శ్రీనివాస గౌడ్

ఈ సందర్శంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అది మానవుని అవశేషాలు మన రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో పురాతన చరిత్ర కల్గి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో పురావస్తూ శాఖ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతుందని , వాటి ద్వార చరిత్ర అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు. ఫణిగిరి లో లభ్యమైన ప్రతిమ ఎంతో అమూల్యమైందని చెప్పారు.మరిన్ని తవ్వకాలు జరిపై విధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

గతంలో రెండు అడుగుల బుద్దిడి విగ్రహం లభ్యం

గతంలో రెండు అడుగుల బుద్దిడి విగ్రహం లభ్యం

దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు మాత్రమే లభించగా, ఇలాంటి ఆరు అడుగుల ప్రతిమ తోలిసారిగా లభించిన బుద్దుడి విగ్రహం క్రీస్తూ పూర్యం 1వ శతాబ్దానికి చెందినట్లు గా బావిస్తున్నామని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు.

English summary
6 feet Budda statue was found at phanigiri of suryapet district .srinivas goud minister for excise of telangana visits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X