భార్య శవంతో 60 కిలోమీటర్ల నడిచిన భర్త
వికారాబాద్ :కట్టుకొన్న భార్య ఊరు కాని ఊర్లో మరణించింది. స్వంత ఊర్లోనే భార్యకు అంత్యక్రియలు నిర్వహించాలని భావించిన భర్త భాదను దిగమింగుకొంటూ గమ్యం వైపు పరుగులు తీశాడు .వికారాబాద్ లో పోలీసులు, స్థానికుల సహాచంతో తన స్వంత ఊరిలో భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు. వికారాబాద్ చేరుకొనే వరకు సుమారు 60 కిలోమీటర్ల దూరం భార్య శవాన్ని చక్రాలబండిపై తోసుకుంటూ తెచ్చిన నిర్భాగ్యుడి దీనగాథ.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలొోని మాఝకోడ్ కు చెందిన రాములు, కవిత లు భార్యభర్తలు. వీరిద్దరికి కుష్టువ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకినప్పటి నుండి ఇద్దరు గ్రామాన్ని వదిలి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ వద్ద బిక్టాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.అమెరికాకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ మౌలాలీలో ప్రతి నెల యాచకులకు కొంత బియ్యం ఇస్తోందని సమాచాంర తెలుసుకొని బీదర్ నుండి శుక్రవారం రాత్రి రైల్లో లింగంపల్లికి చేరుకొన్నారు.

శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ వద్ద టీ తాి మౌలాలికి వెళ్ళేందుకు రాములు సిద్దమయ్యాడు. అదే సమయంలో రాములు భార్య అస్వస్థతకు గురై చనిపోయింది. భార్య చనిపోవడంతో స్వంత ఊళ్ళో అంత్యక్రియలు నిర్వహించాలని రాములు భావించాడు. కాని స్వంత ఊరికి తీసుకెళ్ళేందుకు చేతిలో చిల్లగవ్వ లేదు.
కాని, స్వంత ఊరికి శవాన్ని తీసుకెళ్ళేందుకు ఓ బిచ్చగాడి వద్ద ఉన్న చక్రాల బండిని తీసుకొని భార్య శవాన్ని ఆ చక్రాల బండిపై పెట్టుకొని బయలుదేరాడు. లింగంపల్లి నుండి వికారాబాద్ క సుమారు 60 కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకొన్నాడు.వికారాబాద్ లో స్థానికులు రాములు దీనపరిస్థితిని తెలుసుకన్నారు. రాములు స్వంత ఊరికి వెళ్ళేందుకు సహాకరించారు. వెంటనే స్థానిక సిఐ రవికి స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన రాములును స్వంత ఊరికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశాడు.శనివారం సాయంత్రానికి రాములు తన భార్య అంత్యక్రియలను స్వంత ఊళ్ళో చేశాడు.