వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Covid cases : తెలంగాణలో కొత్తగా 647 కరోనా పాజిటివ్ కేసులు.. మరో ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గడిచిన 24 గంట‌ల్లో కొత్తగా 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మ‌రో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. మరో 1,180 రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,659 కు చేరుకోగా.. ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందినవారి సంఖ్య 3780కి చేరింది. తాజాగా మరో 749 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,27,254కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 1,20,213 మందికి కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకూ 2,12,24,462 కరోనా టెస్టులు చేశారు. ఒక మిలియన్ జనాభాకు 5,70,243 కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.32శాతం ఉండగా రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 97.90 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 0.59శాతం ఉండగా రాష్ట్రంలో 1.3శాతం ఉంది.

647 new covid cases and four deaths reported in telangana

దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే... గడిచిన 24 గంటల్లో 39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,13,32,159కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 546 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ కారణంగా 4 లక్షల 20 వేల 16 మంది మరణించారు.మరో 35,087మంది గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 3కోట్ల 5లక్షల పైచిలుకు మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,08,977 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 42.78 కోట్ల పైచిలుకు మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.

Recommended Video

Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.

English summary
In the last 24 hours in Telangana, 647 new corona positive cases were reported. Another four covid victims were died. Another 1,180 reports are yet to come. Including the latest cases, the number of positive cases registered across the state has reached 6,40,659.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X