మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సతతం హరితం: వియావాకీ పద్ధతిలో మొక్కలు నాటుతూ. మెదక్‌లో కేసీఆర్ అంకురార్పణ

|
Google Oneindia TeluguNews

ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం గురువారం లాంఛనగా ప్రారంభించింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్, హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్, జిల్లా కేంద్రాల్లో మంత్రుల, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హరితహారం కార్యక్రమం లాంఛ్ చేశారు. మెదక్ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానికనేతలు, అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో కార్యక్రమంలో 100 మంది మాత్రమే పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆరో విడత హరితహారంలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రామం, పట్టణంలో మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మోడల్‌ ఫారెస్టును అభివృద్ధి చేస్తారు. నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం సాంకేతికత పరిజ్ఞానం వినియోగించనున్నారు. ప్రతి గ్రామంలో కనీస వసతులతో చిన్నపార్క్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.

6th phase haritha haram launched by cm kcr

నియోజకవర్గంలో అడవుల పునరుద్ధరణ కోసం ప్రజాప్రతినిధులను భాగస్వామ్యలవుతారు. నాటిన ప్రతీ మొక్క పెరిగేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో అయితే పంచాయతీలదే రెస్సాన్సిబిలీటీ. ఇదివరకు నాటిన ప్రాంతాల్లో చనిపోయిన మొక్కలను గుర్తించి.. అక్కడ తిరిగి మొక్కలు నాటతారు. రైతులకు ఆదాయం చేకూర్చేలా ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ వెదురు ప్రోత్సాహక సంస్థ సహకారంతో చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంచేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో 95 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను అభివృద్ధి చేస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 30 కిలోమీటర్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేస్తారు.

English summary
6th phase haritha haram launched by cm kcr in medak district. another places ministers attend the programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X