వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూత, వారం క్రితం నీలోఫర్‌లో డెలివరీ, కంటైన్మెంట్ జోన్‌గా...

|
Google Oneindia TeluguNews

ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. ఆ గర్భవతి వారం క్రితం జన్మనిచ్చింది. కానీ చిన్నారి మాత్రం కలతగా ఉండటంతో.. ఎందుకైనా మంచిదని.. సీజేరియన్ చేసిన నీలోఫర్ తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది.. చిన్నారి చనిపోయింది. పరీక్షలు చేస్తే.. 7 రోజుల పసిగుడ్డుకు కరోనా వైరస్ ఉంది అనే జీర్ణించుకోలేని నిజం వెలుగుచూసింది.

వారం క్రితం డెలివరీ

వారం క్రితం డెలివరీ


హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్‌కి చెందిన జంట.. గత పదేళ్లుగా జీ ప్లస్ 1లో ఉంటున్నారు. వారం క్రితం గర్భవతి నీలోఫర్ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. తర్వాత తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ చిన్నారికి కరోనా వైరస్ సోకింది. కానీ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకున్నా.. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. కరోనా వైరస్ పరీక్షలు తక్కువ చేస్తున్నారని హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కానీ పరీక్షలు నిర్వహణ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

కంటైన్మెంట్ జోన్

కంటైన్మెంట్ జోన్

చిన్నారి చనిపోయాక.. తల్లిదండ్రులకు వైరస్ పరీక్ష చేశారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌కు కూడా టెస్టులు చేశారు. వారు ఉంటోన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. జీ ప్లస్ వన్ ఇంటి నుంచి 14 రోజుల వరకు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు స్పష్టంచేశారు. ఆ ఇంటికి స్టాంప్ కూడా వేశారు.

Recommended Video

Viral Video : Baby Monkey Rescued by Mother As It Crosses Cable Wire
ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు

ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు


కరోనా వైరస్ సోకి 7 రోజుల పాప చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వైరస్ సోకి చనిపోయిన పిన్న వయస్సు గల చిన్నారిగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 2 వేల మార్క్‌కి చేరింది. మంగళవారం నాటికి 1991 కేసులు ఉండగా.. 650 మందికి చికిత్స అందిస్తున్నారు. 1284 మందిని డిశ్చార్జ్ చేశారు. 57 మంది చనిపోయారు. మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగించింది.

English summary
Telangana has witnessed the death of its youngest COVID-19 patient, a 7-day-old baby on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X