వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 లక్షల కరెంట్ బిల్లు: మూడు బల్బులు, రెండు ఫ్యాన్లకే బిల్లు మోత, నోరెళ్లబెట్టిన వినియోగదారుడు..

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల మీటర్ రీడింగ్ తీయకపోవడం ఏంటో గానీ.. కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. రూ.2 లక్షలు బిల్లు మొదలుకొని లక్షలు లక్షలు బిల్లులు వస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో కూడా ఓ సామాన్యుడికి లక్షల కరెంట్ బిల్లును వడ్డించారు. బిల్లు చూసిన ఇంటి యజమాని నోరెళ్లబెట్టాడు. నెల నెల రూ.500 బిల్లు ఏకంగా లక్షలు రావడం ఏంటీ అని నెత్తి పట్టుకున్నాడు.

గర్బిణీకి డెలివరీ: రిపోర్టులో కరోనా పాజిటివ్, వైద్యుడు, ఏడుగురు నర్సులు హోం క్వారంటైన్గర్బిణీకి డెలివరీ: రిపోర్టులో కరోనా పాజిటివ్, వైద్యుడు, ఏడుగురు నర్సులు హోం క్వారంటైన్

కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన శ్రీనివాస్‌కు నెల నెల రూ.500 బిల్లు వచ్చేది. లాక్ డౌన్ వల్ల మూడు నెలలు మీటర్ రీడింగ్ తీయలేదు. దీంతో ఇటీవల మీటర్ రీడింగ్ చేశారు. రీడింగ్ తీయగా 7 లక్షల 29 వేల 471 రూపాయల బిల్లు వచ్చింది. ఇదేంటి అని అడగగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 75 వేల 871 యూనిట్లు వాడుకున్నారని తెలిపారు. అందుకే బిల్లు ఎక్కువ వచ్చిందని తెలిపారు.

7 lakh power bill for two fans with three bulbs..

కానీ శ్రీనివాస్‌ ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. దీనికే ఇంత బిల్లు అని విస్తుపోయాడు. కూలీ చేసుకునే తాను ఎలా బిల్లు కట్టాలని అడిగాడు. కానీ దీనిపై సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ స్పందించారు. బిల్లు యూనిట్ల లెక్కింపులు అంకెలు తప్పుగా పడటంతో ఎక్కువగా వచ్చిందని తెలిపారు. దానిని వెంటనే సరిచేశామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ మొదటి బిల్లు చూసిన శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ గుండె గుబేల్ మంది. తర్వాత మార్చడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
7 lakh power bill for two fans with three bulbs in kamareddy district isrojiguda village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X