హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఆంధ్రా బ్యాంక్ దోపిడీలో దుండగులు పక్కా వ్యూహాన్ని అనుసరించారు. అంతేకాదు దోపిడీ తర్వాత ఆధారాలు దొరక్కుండా కారం పోడి చల్లారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ (డిజిటల్ వీడియో రికార్డర్)ను సైతం ఎత్తుకెళ్లారు.

శని, ఆదివారాలు సెలవులు రావడంతో బ్యాంకులోనే తిష్ట వేసి పనికానిచ్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా ప్రొఫెషనల్ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారిస్తున్నారు. యాపీ ఘజియాబాద్ గ్యాంగ్ లేదా మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు.

వారం రోజుల పాటు పరిసరాల్లో రెక్కీ నిర్వహించి బ్యాంక్ లోపలి పరిసరాలతో పాటు వెనుకాల భాగం నుంటి ఎంట్రీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. వీటితో పాటు ఈ ప్రాంతంలో జరిగే పోలీసు పెట్రోలింగ్‌ను కూడా దుండగులు ఫాలో అయ్యారని తెలుస్తోంది.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్‌లోకి దుండగులు శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అందులోనే ఉండి ఈ దోపిడీకి స్కెచ్ వేశారని పోలీసులు ఓ కోణంలో అభిప్రాయపడుతున్నారు. శనివారం రాత్రి మొదట బ్యాంక్ వెనకాల భాగంలోని ఇనుప గ్రిల్‌కు ఉన్న తాళాన్ని కోశారు. ఆ తర్వాత బ్యాంక్ బాత్‌రూం వెంటిలేటర్ వద్దకు చేరుకున్నారు.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

అక్కడ చిన్న టేబుల్‌ను వేసుకుని మొదటి 10 అంగుళాలు ఎత్తు, 15 అంగుళాలు వెడల్పు ఉన్న కిటికీ గ్రిల్ రాడ్‌లను కోసేశారు. ఆ తర్వాత టేబుల్ మీద ఒక వ్యక్తి నిల్చుని ఉండగా అతనిపై ఎక్కి ఈ గ్రిల్ ద్వారా లోనికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలోనే మొదటి వ్యక్తి గ్రిల్ నుంచి బాత్‌రూంలోకి దిగుతున్నప్పుడు ఫ్లష్ మీద కాలు పెట్టడంతో అది విరిగిపోయింది.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఇలా ఇద్దరు లోనికి ప్రవేశించి నేరుగా బంగారం కుదవ పెట్టిన అల్మారాలు ఉన్న గదికి వచ్చారు. అక్కడి గ్రిల్‌ను కోసి నేరుగా లోపలికి వెళ్లారు.. ఆ తర్వాత అల్మారాలను ఉన్న రూఫ్ పైకి ఎక్కి దానికి సగం అడుగు రూపంలో రంథం చేసి దాని చేతి పెట్టి మొత్తం 70 తులాల వరకు కాజేశారని దర్యాప్తులో తేల్చారు.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఖాతాదారులు, స్థానికులు మాత్రం దాదాపు ఐదున్నర కేజీల బంగారం పోయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు మాత్రం బ్యాంక్ అధికారులు తమకు 70 తులాలు పోయిందని ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. శని, ఆది వారాల్లో బ్యాంకులో ఉండి ఆ తర్వాత సోమావారం ఉదయం వెళ్లిపోయి ఉంటారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

మరో కోణంలో దుండగులు లోనికి ప్రవేశించిన తర్వాత కొన్ని గంటల్లోనే తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారని లేదంటే అదే ర్యాక్‌లో దాదాపు మరో 12 కేజీల బంగారం కూడా ఎత్తుకెళ్లేవారని భావిస్తున్నారు. అదే కాకుండా బ్యాంక్ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఓ నజర్ పెట్టారు.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి, ఇన్‌చార్జి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. చోరీకి గురైన సొత్తు గిరివి పెట్టిన బంగారమేనన్నారు. అయితే ఈ గిరివి పెట్టిన బంగారం వివరాలను చూసే బ్యాంక్ అధికారులు లీవ్‌లో ఉండడంతో ఎంత పోయిందనే విషయంపై పూర్తి సమాచారం లేదన్నారు.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

అతను వస్తే ఎంత పోయందనే అంశంపై క్లారిటీ వస్తుందన్నారు. కాగా, ఘటనా స్థలాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఎస్‌ఓటీ, సీసీఎస్‌లతో పాటు పలు విభాగాల పోలీసులు సందర్శించారు. ఇటీవల కొన్ని కేసులను దర్యాప్తు చేసిన పోలీసులకు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న క్రిమినల్స్ అధికంగా బైక్‌లను వాడుతున్నారని తేలింది.

 ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

ఆంధ్రా బ్యాంక్ దోపిడీ: వారం పాటు రెక్కీ, కారం పొడి చల్లారు

దీంతో ఈ బ్యాంక్ ముందు వెనకాల ప్రాంతాలతో పాటు రహదారిపై అనుమానాస్పదంగా నెల రోజుల నుంచి ఏదైనా వాహనాలు తిరిగాయా అనే కోణంలో సీసీ కెమెరాల ఫుటేజ్‌లతో పాటు టోల్ ప్లాజా సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ర్టాల మోడస్ అపరెండీలను పరిశీలిస్తున్న పోలీసులు ఖచ్చితంగా దుండుగులు బోలెరో లేదా ఏదైనా కారులో వచ్చి ఉంటారని ఆలోచన చేస్తున్నారు.

English summary
Unidentified persons struck at Andhra Bank branch on an inter-state highway in Ghatkesar late on Sunday despite heavy police patrolling in the area. The police suspect them to be professional burglars as they damaged all CC cameras and computers in the bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X