వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది: గవర్నర్ నరసింహన్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహ్మద్ అలీ ఇతర ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.

70Th Republic day celebrations in Telangana live updates

Newest First Oldest First
11:44 AM, 26 Jan

తెలంగాణ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం: ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను సులభతరం చేసింది. ఎస్టీలకు కొత్త పంచాయతీలను సృష్టించి తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచింది
11:40 AM, 26 Jan

తెలంగాణ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం:తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
11:35 AM, 26 Jan

తెలంగాణ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం: తెలంగాణలో సాగునీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పొరుగురాష్ట్రాలతో సమస్యలు పరిష్కరించుకుని ప్రగతి వైపు తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోంది.
11:34 AM, 26 Jan

గవర్నర్ ప్రసంగం: తెలంగాణలో రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి.రాష్ట్రం ఏర్పడిన నాలుగునర్ర ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి దిశగా దూసుకెళుతోంది
11:32 AM, 26 Jan

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి మరోసారి ఆయన ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ నిలబెట్టుకుంటున్నారు
11:30 AM, 26 Jan

తెలంగాణ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: సీఎం కేసీఆర్ రాష్ట్రానికి బలమైన నాయకత్వం వహించడమే కాకుండా రాజీకయ స్థిరత్వాన్ని తీసుకురావడంతో కేసీఆర్ విజయం సాధించారు
11:29 AM, 26 Jan

తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది
11:16 AM, 26 Jan

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కవాతు నిర్వహిస్తున్న పోలీస్ బెటాలియన్లు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది
10:55 AM, 26 Jan

పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న గవర్నర్ నరసింహన్. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్. త్రివర్ణ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్ ఆ తర్వాత గౌరవ వందనం స్వీకరించారు
10:50 AM, 26 Jan

తెలంగాణలో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా సీఎం కేసీఆర్ దేశంకోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల స్తూపం వద్ద అమరజవాన్లకు నివాళులు అర్పించారు. మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్‌కు గవర్నర్ నరసింహన్ చేరుకుని జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తారు.

English summary
70th Republic day celebrations in Telangana took off in a grand style. All the arrangements have been made by the state govt. Governor ESL Narsimhan will hoist the National flag after he participating in AP Republic day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X