• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?

|

వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న విషాదం అందరినీ షాక్ కు గురి చేస్తుంది . ఇప్పటి వరకు బావిలో 9 మంది శవాలు వెలికితీశారు. స్థానికంగా ఈ ఘటన షాక్ కు గురి చేసింది. అసలు ఈ తొమ్మిది మంది మరణానికి గల కారణాలేమిటి ? వలస కార్మికులు కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో స్వస్థలాలకు వెళ్ళలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారా ? లేకా ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

వరంగల్ లో వలస విషాదం ... బావిలో శవాలుగా వలస కార్మిక కుటుంబం.. కేసులో కొత్త ట్విస్ట్

బావిలో కలిసిపోయిన 9 మంది వలస జీవుల ప్రాణాలు

బావిలో కలిసిపోయిన 9 మంది వలస జీవుల ప్రాణాలు

సుప్రియ కోల్డ్ స్టోరేజ్ సమీపానగల ఒక బావిలో వలస కార్మికులు విగతజీవులుగా తేలారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు, మరో ఇద్దరి మృతదేహాలు ఈరోజు ఇప్పటివరకు వెలికితీశారు. నిన్న రాత్రి వెలికితీసిన ఒకే కుటుంబానికి చెందిన మృతుల్లో భార్య భర్తలు, వారి కుమార్తె, మనవడు ఉన్నట్లుగా గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున అదే కుటుంబానికి చెందిన మరొక మృతదేహం లభ్యమైంది.ఇక ఆ తరువాత వరుసగా మృతదేహాలు బయట పడుతూ వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 9 మంది బావిలో శవాలుగా తేలారు. ఇక ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు .

బావిలో 9 శవాలు హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా?

బావిలో 9 శవాలు హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా?

వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి.నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో 5 మృతదేహాలు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు, వారితో పాటు మరో ఇద్దరి శవాలు బావిలో ఉండటంతో హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక గోదాం ఆవరణలో బావిలో 9 వలస జీవుల శవాలు..ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ఒక గోదాం ఆవరణలో బావిలో 9 వలస జీవుల శవాలు..ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

ఇక గోదాం ఆవరణలో కార్మికులు లేకపోవటంతో గుర్తించిన నిర్వాహకులు బావిలో శవాలుగా తేలిన వారిని చూసి గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు.

ఇక ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మక్సూద్ , అతని భార్య నిషా, కుమార్తె బూస్రా, మూడు సంవత్సరాల వయసున్న బూస్రా కొడుకు , మక్సూద్ ఇద్దరు కొడుకులు షాబాద్ ఆలం, సోహెల్ ఆలం , షకీల్ గా గుర్తించారు. ఇక వీరితోపాటు బీహార కు చెందిన .శ్రీరాం, శ్యాం లుగా గుర్తించారు.

  Kim Jong-un Faked His Own Death To Expose Traitors In His Inner Circle
  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ రవీందర్ .. దర్యాప్తు వేగం

  సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ రవీందర్ .. దర్యాప్తు వేగం

  మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించిన ఏడుగురు, అలాగే బీహార్ కు చెందిన ఇద్దరు గీసుగొండ మండల పరిధిలోని గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియాలో పని చేస్తున్నారు.ఇక వీరి మృతికి గల కారణాలు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . మొదట బీహార్ యువకులను అనుమానించిన పోలీసులకు వారి మృత దేహాలు కూడా లభ్యం కావటంతో ఈ కేసు పెద్ద చిక్కుముడిలా తయారైంది. ఇక సంఘటనా స్థలాన్ని వరంగల్ నగర పోలీస్ కమీషనర్ డా . రవీందర్ పరిశీలించారు. గొర్రెకుంటలోని సంఘటనా స్థలానికి వెళ్ళిన ఆయన అధికారులను , గోదాం యజమానిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.మొత్తం 9 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఇక ఈ కేసులో అసలు మరణానికి కారణాలు ఏమి ఉంటాయా అన్న కోణంలో దరాప్తు సాగుతుంది.

  English summary
  seven of a family of migrant workers from West Bengal and another two migrant labor from bihar were found dead in a well in Gorrekunta village in Warangal Rural district. police filed a case as suspecious deaths and started investigation .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X