వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కేసీఆర్’ చీరలపై ఆసక్తి చూపని మహిళలు?: లక్షల్లో మిగిలిపోయాయి!

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఎన్నో వివాదాలకు తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఈ చీరల పంపిణీకి లక్షలాదిమంది దూరంగా ఉండటం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఎన్నో వివాదాలకు తెరలేపిన విషయం తెలిసిందే. అయితే ఈ చీరల పంపిణీకి లక్షలాదిమంది దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చీరల పంపిణీలో అధికారులు కూడా అంత ఆసక్తి ప్రదర్శించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1.04 కోట్ల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి సెప్టెంబరు మూడోవారంలో చీరలను పంపిణీ చేశారు. రేషన్‌ దుకాణాల వారీగా పంపిణీకి ఏర్పాట్లు చేసినా... ఇంకా 9 లక్షలకు పైగా చీరలు మిగిలిపోయాయి.

9 lacs sarees are not distributed to women

Recommended Video

Telangana women refused Batukamma sarees టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..

మొత్తం 1,04,46,794 చీరలకు 94,76,554 పంపిణీ అయ్యాయి. దీంతో ఇంకా 9,70,240 చీరలు మిగిలే ఉన్నాయి. చీరల పంపిణీ సందర్భంలో తమకు నాణ్యమైన చీరలు ఇవ్వలేదంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

English summary
It is said that 9 lacs sarees are not distributed to women in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X