వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: 9 మంది అరెస్ట్, మిర్చిల బండి వివాదమే కారణం

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ:నల్గొండ మున్సిఫల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఇప్పటివరకు 9 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు.ఈ ఘటనతో రాజకీయాలకు సంబంధం లేదని ఎస్పీ చెప్పారు.మిర్చి బండి వద్ద జరిగిన గొడవే ఈ హత్యకు కారణమని ఎస్పీ తెలిపారు.

మున్సిఫల్ చైర్‌పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ఐదు రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఆదివారం నాడు ఎస్పీ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

9 people arrested for congress leader boddupalli srinivas murder case

ఈ కేసులో మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నట్టు చెప్పారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులంతా శ్రీనివాస్‌కు మిత్రులేనని ఎస్పీ చెప్పారు. ఇది రాజకీయ హత్య కాదని తేల్చి చెప్పారు. ఒక మిర్చి బండి వద్ద జరిగిన గొడవ విషయంలో నిందితుల మధ్య తగాదా వచ్చిందని ఎస్పీ చెప్పారు.

మల్లేశ్, చక్రి, రాంబాబు, గోపి మరికొందరు గొడవపడ్డారని ఎస్పీ చెప్పారు. ఈ తగాదా విషయాన్ని నిందితులు బొడ్డుపల్లి శ్రీనివాస్‌కు తెలిపారని ఎస్పీ చెప్పారు.. గొడవ విషయం తెలిసిన శ్రీనివాస్ అక్కడికి వచ్చాడు. నిందితుల్లో కొందరు శ్రీనివాస్‌తో గొడవపడ్డారు.
నిందితులు క్షణికావేశంలో శ్రీనివాస్‌ను బలంగా కొట్టారు. గాయపడిన శ్రీనివాస్ బతికుంటే కక్ష తీర్చుకుంటాడనే భయంతో నిందితులు చంపేశారని ఎస్పీ చెప్పారు.హత్య అనంతరం నిందితులు హైదరాబాద్ పారిపోయి మిత్రుని వద్ద తలదాచుకున్నారని తెలిపారు.

English summary
Nalgonda police arrested 9 people in congress leader Boddupalli Srinivas murder case . Nalgonda Sp Srinivasa rao spoke to media on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X