హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ : ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్... ఆర్ఎంపీ ద్వారా..?

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట పట్టణంలో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. పట్టణానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడి ద్వారా వీరికి వైరస్ సోకినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఆ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలగా... అతని ప్రైమరీ కాంటాక్టులుగా 17 మందిని గుర్తించి టెస్టులు చేశారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

కరోనా విలయం: అక్కడ మళ్లీ లాక్ డౌన్.. 235కొత్త కేసులతో పాట్నా బెంబేలు.. కరోనా విలయం: అక్కడ మళ్లీ లాక్ డౌన్.. 235కొత్త కేసులతో పాట్నా బెంబేలు..

శుక్రవారం(జూలై 10) ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహబూబ్‌నగర్ పట్టణంలో 8,నాగర్‌కర్నూలులో 2,జోగులాంబ గద్వాలలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ డీహెచ్ఎంవో కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అలాగే రవీంద్రనగర్‌లో ఓ యువకుడికి,టీడీగుట్టలో ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

9 persons of one family tested coronavirus positive in mahbubnagar district

Recommended Video

KCR, KTR ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా..? || Oneindia Telugu

జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలో ఓ యువకుడు,జడ్చర్లలోని లక్ష్మీనగర్‌లో ఓ యువకుడు,గద్వాల పాత బస్టాండ్‌ సమీపంలో ఓ కిరాణ వ్యాపారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల నాగర్‌కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తికి కూడా పాజిటివ్‌గా తేలింది. కొల్లాపూర్‌లో ఓ ఆర్ఎంపీ వైద్యుడి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తఇప్పటివరకూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 367 పాజిటివ్ కేసులు నమోదవగా... ఇందులో 25 మంది మృత్యువాతపడ్డారు.

English summary
9 persons of one family in Narayanapet tested coronavirus positive in Mahabubnagar district. Officials identified them as primary contacts of a RMP doctor who recently tested positive
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X