వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

93 ఏళ్ల బామ్మ భేష్: కరోనాను జయించిన వృద్దురాలు, కానీ పిల్లల ఆదరణ కరవు, వైరస్ తగ్గినా గాంధీలోనే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల ప్రేమ, అప్యాయతలు తగ్గి అనుమానం, చీదరింపు పెరుగుతున్నాయి. సొంత కుటుంబసభ్యులతో పరాయివారి కన్నా హీనంగా కనిపిస్తోన్న ఘటనలు కొకొల్లలు. అందుకు వారిని కూడా తప్పుపట్టలేం.. ఎందుకంటే ప్రాణం మీద తీపితోనే అలా చేస్తున్నారు. కానీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన గుండెల్ని పిండేస్తోంది. 93 ఏళ్ల వృద్దురాలు కరోనా వైరస్ జయిస్తే.. సంబర పడాల్సిన ఫ్యామిలీ మెంబర్స్.. ఆమెకు మరోసారి పరీక్ష చేయాలని గాంధీ సిబ్బందిని కోరి తమ అనుమానాన్ని బయటపెట్టుకున్నారు.

 కోలుకున్న 93 ఏళ్ల బామ్మ

కోలుకున్న 93 ఏళ్ల బామ్మ

హైదరాబాద్‌లో ఓ ఫ్యామిలీకి వైరస్ సోకింది. అందులో 93 ఏళ్ల వృద్దురాలు కూడా ఉన్నారు. అతని కుమారుడు, గ్రాండ్ చిల్డ్రన్‌కు కూడా వైరస్ వచ్చింది. అయితే గత వారం వైరస్ సోకిన కుమారుడు చనిపోయాడు. ఇద్దరు మనవరాళ్ల ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక విషయానికి వస్తే.. వృద్దురాలికి కూడా కరోనా వైరస్ తగ్గింది. ఆమెను భగవంతుడు కరుణించాడు. కానీ పిల్లలు కాదు. వైరస్ తగ్గడంతో ఇంటికి తీసుకెళ్లాలని గాంధీ సిబ్బంది సమాచారం పంపించారు. కానీ ఆ పిల్లలు మరోసారి పరీక్ష చేయాలని పట్టుబట్టారు.

మరోసారికి ‘నో'

మరోసారికి ‘నో'

వాస్తవానికి రోగికి వైరస్ తగ్గాక మరోసారి పరీక్షను చేయరు. కానీ అతను/ఆమెను మాత్రం 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని మాత్రం సూచిస్తారు. కానీ తమ బామ్మకు వైరస్ పూర్తిగా నయమైందో లేదోననే అనుమానంతో మరోసారి పరీక్ష చేయాలని కోరారు. కానీ ఆ ప్రతిపాదనను గాంధీ ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించింది. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న గ్రాండ్ చిల్డ్రన్ మాత్రం మరోసారి పరీక్షలు చేయాలని పట్టుబట్టారు. దీంతో అమెరికాలో ఉన్న మరొకరిని సంప్రదించగా మరికొద్దిరోజులు ఉంచుకోవాలని కోరారు.

Recommended Video

కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
హెల్త్ కండీషన్‌పై ఆందోళన

హెల్త్ కండీషన్‌పై ఆందోళన

వృద్దురాలి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా లేదు అని, అందుకే తమ బంధువులు ముందుకు రావడం లేదు అని మనమరాలు పేర్కొన్నది. కానీ మనవరాళ్లు అభ్యర్థించడంతో మరికొద్ది రోజులు ఉంచుకునేందుకు గాంధీ ఆస్పత్రి అంగీకరించింది. అయితే వీరే కాదు ఇదివరకు కూడా చాలా మంది తమ వెంట తీసుకెళ్లేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన ఏడు కేసుల్లో ఫ్యామిలీ తీసుకెళ్లేందుకు నిరాకరించిందని తెలిపారు. తాము ఉండే చోట సదరు డిశ్చార్జ్ అవుతున్న వారికి ప్రత్యేక గది లేదు అని పేర్కొన్నారు.

English summary
93 years old woman recovered for Covid-19 at the state-run Gandhi Hospital after her family members expressed hesitance to take her home and asked for tests to be done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X