హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెగ్యులర్‌గా 1000కి దగ్గరగా... తెలంగాణలో 15వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు...

|
Google Oneindia TeluguNews

-తెలంగాణలో కొత్తగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 253కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.తాజా కేసుల్లోనూ అత్యధికంగా 861 కేసులు జీహెచ్ఎంసీలోనే నమోదవడం గమనార్హం. ఇప్పటివరకూ 5,582 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 9,559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కేంద్ర బృందం పర్యటన

కేంద్ర బృందం పర్యటన

తెలంగాణలో కరోనా పరిస్థితులు,నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు కేంద్ర బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. కోవిడ్ 19 ఆస్పత్రులైన గాంధీ,టిమ్స్‌లను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించింది. దోమలగూడలోని ఓ కంటైన్‌మెంట్ ప్రాంతాన్ని కూడా స్వయంగా సందర్శించి పరిశీలించింది. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా రోగి మృతికి సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ కార్యదర్శి అగర్వాల్‌ను అడిగి తెలుసుకుంది.

అధికారులతో కేంద్ర బృందం చర్చలు

అధికారులతో కేంద్ర బృందం చర్చలు

అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటల పాటు కేంద్ర బృందం చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య శాఖ అదికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల కొరత లేకుండా ఉండేందుకు మరో 4489 మంది వైద్యులను రిక్రూట్ చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 17081 పడకలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

సీఎస్ సోమేష్ కుమార్ ఏమన్నారు...

సీఎస్ సోమేష్ కుమార్ ఏమన్నారు...


కేంద్ర బృందం రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని సమావేశం అనంతరం సోమేష్ కుమార్ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం వైద్య పరీక్షల సామర్థ్యం పెంచాలని,కాంటాక్ట్ ట్రేసింగ్ వేగవంతం చేయాలని కేంద్ర బృందం సూచనలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 2 నెలల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయలను మెరుగపరిచేందుకు రూ.475.74కోట్లు మంజూరు చేసినట్టు సోమేష్ కుమార్ కేంద్ర బృందానికి తెలిపారు. టెస్టుల అనంతరం కేంద్ర బృందం ఢిల్లీకి బయలుదేరింది. తెలంగాణలో పరిస్థితులపై మంగళవారం(జూన్ 29) కేంద్రానికి ఈ బృందం నివేదిక అందించనుంది.

Recommended Video

Telangana-AP border: No vehicle Entry Into Guntur District Between 7pm & 7am
ప్రతీ రోజూ 1000కి అటు ఇటుగా కేసులు..

ప్రతీ రోజూ 1000కి అటు ఇటుగా కేసులు..

గత సోమవారం(జూన్ 22) నుంచి ఆదివారం(జూన్ 28) వరకూ నమోదైన కేసులను పరిశీలిస్తే.. ప్రతీరోజూ వెయ్యికి కాస్త అటు ఇటుగా కేసులు నమోదయ్యాయి. సోమవారం(జూన్ 22) 872,మంగళవారం 879,బుధవారం 891,గురువారం 920, శుక్రవారం 985, శనివారం 1080,ఆదివారం 983,సోమవారం(జూన్ 29) కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తోంది.

English summary
975 fresh coronavirus cases were reported in Telangana,total number reached to 15,394. 6 new deaths also reported from the state on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X