హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు: 12వేల మార్క్ దాటింది, 237కు మరణాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 237కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

శుక్రవారం 78 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4766కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7436 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 4374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు.

 985 new corona positive cases recorded in Telangana: 7 more deaths

తాజాగా నమోదైన 985 కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 774 ఉన్నాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్ 53, వరంగల్ అర్బన్ 29, మెదక్ 9, ఆదిలాబాద్ 7, నాగర్ కర్నూల్ 6, నిజామాబాద్‌లో 6, రాజన్న సిరిసిల్లలో 6, సిద్దిపేటలో 3, ములుగులో 2, వికారాబాద్‌లో 1, మహబూబ్ నగర్‌లో 1, జగిత్యాలలో 2, జయశంకర్ భూపాలపల్లిలో 3, ఖమ్మంలో 3, యాదాద్రి భువనగిరిలో 2, మిర్యాలగూడలో 1 కేసులు నమోదయ్యాయి.

Recommended Video

#Lockdown : Street Merchants In Hyderabad Facing Problems Due To Corona Lockdown

ఇక దేశ వ్యాప్తంగా 5,09,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,97,508 యాక్టివ్ కేసులున్నాయి. 2,95,917 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడి 15,689 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అత్యధికంగా మహారాష్ట్రలో 5024 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,52,765కు చేరింది. 65,829 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 7106 మంది చనిపోయారు.

English summary
985 new corona positive cases recorded in Telangana: 7 more deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X