వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్న బీటెక్ విద్యార్ధి .. సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటే

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న ఇంటర్, నిన్న పదో తరగతి విద్యార్థులు, ఇప్పుడు బీటెక్ విద్యార్థులు సైతం బలవన్మరణాల బాట పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్‌లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు 'బై గయ్స్‌', 'థ్యాంక్యూ ఫర్‌ గివింగ్‌ మి దిస్‌ వండర్‌ఫుల్‌ లైఫ్‌' .. అంటూ స్నేహితులకు మెసేజ్‌ చేశాడు. అంతే కాదు తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ కూడా రాశాడు.

<strong>విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్</strong>విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్

బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయిన విద్యార్ధి ... మనస్తాపంతో ఆత్మహత్య

బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయిన విద్యార్ధి ... మనస్తాపంతో ఆత్మహత్య

ఇక అసలు విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం లింగాలకు చెందిన పవన్ హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఇటీవల జరిగిన ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు పవన్. మొదటి సెమిస్టర్ లో ఫెయిలైన పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు. అయితే, కుమారుడు ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు తెలియదు. గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

‘బై గయ్స్‌', ‘థ్యాంక్యూ ఫర్‌ గివింగ్‌ మి దిస్‌ వండర్‌ఫుల్‌ లైఫ్‌' అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్నేహితులకు పోస్ట్

‘బై గయ్స్‌', ‘థ్యాంక్యూ ఫర్‌ గివింగ్‌ మి దిస్‌ వండర్‌ఫుల్‌ లైఫ్‌' అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్నేహితులకు పోస్ట్

భవనంపై నుండి దూకటం గమనించిన స్నేహితులు స్థానికులతో కలిసి పవన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. అయితే, అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘బై గయ్స్‌', ‘థ్యాంక్యూ ఫర్‌ గివింగ్‌ మి దిస్‌ వండర్‌ఫుల్‌ లైఫ్‌' ..అని పోస్టు చేశాడు. పవన్ జేబులో ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 తల్లిదండ్రులకు న్యాయం చెయ్యలేకపోతున్నా అని సూసైడ్ నోట్

తల్లిదండ్రులకు న్యాయం చెయ్యలేకపోతున్నా అని సూసైడ్ నోట్

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తన కోసం తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని , కానీ తాను వారిని బాధ పెడుతున్నానని వారికి న్యాయం చెయ్యలేకపోతున్నానని తన సూసైడ్ నోట్ లో రాశాడు పవన్ . అంతే కాదు వారిని నవ్వుల పాలు చెయ్యలేక చనిపోతున్నా అంటూ ఆంగ్లంలో రాసుకున్నాడు . ఇదిచూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

English summary
An 19-year-old B tech student allegedly committed suicide by jumping from a building in khammam district . An engineering student named Pavan from Khammam district kallur mandal Lingala village studying Btech in hyderabad .He failed in few subjects in first semister , because of this he was depressed and committed suicide, he wrote a suicide note to his parents and he mentioned his friends in instagram post .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X