హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దోమలు లేని నగరం.!వినూత్న పద్దతిలో దోమల నివారణ.!పర్యవేక్షించిన మేయర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దోమల నివారణకు నగర పాలక సంస్థ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. నగర ప్రజలను దోమల బెడద నుండి విముక్తి కలిగించేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తూన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు మానవ వనరుల ద్వారా కూడా నూతన పద్దతులలో లార్వా దశ నుండే నివారణ చర్యలు చేపట్టుతున్నారు.

నగర ప్రజలకు దోమల వలన వ్యాదులు సంక్రమించే అవకాశాలు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దోమలను నివారించేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది నగర పాలక సంస్థ. అందులో మొదటిది డ్రోన్ పద్దతి కాగా రెండోది ఇంటర్నెట్ అప్ థింగ్స్ పద్దతి ద్వారా దోమలను నియంత్రించడానికి వీలవుతుందని నగర పాలక సంస్థ అదికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ మస్కిటో డిజిటల్ సొల్యూషన్ ద్వార గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టింది. ఈ నేపథ్యంలో అర్బన్ మలేరియా పథకంలో బాగంగా ఇంటర్నెట్ అప్ థింకింగ్ పరికరాలను ఫాగింగ్ యాంత్రలకు అమర్చారు.

A city without mosquitoes!Mosquito control in an innovative way.!Mayor Supervised.!

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 10 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లతో పాటుగా మారో 64 వెహికిల్ మౌంటెడ్ యంత్రాలు, మొత్తం 74 మిషన్లకు స్మార్ ట్రాకర్ ను అమర్చడం జరిగింది. ఈ పరికరాలను మొబైల్ అప్లికేషన్ ద్వారా అధికారులకు యాక్సెస్ చేసి డాష్ బోర్డుకు అనుసంధానం చేయడం మూలంగా జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటుగా ఎంటోమాలోజి చీఫ్ , సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది ఫాగింగ్ పక్రీయను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడానికి వీలవుతుంది.

A city without mosquitoes!Mosquito control in an innovative way.!Mayor Supervised.!

ఈ నూతన పరిజ్ఞానం వలన ఫాగింగ్ యంత్రాలు ఒక రోజులో ఎన్ని ప్రాంతాలు ఎంత దూరం ప్రయాణించాయో తెలుసుకొని సక్రమ పద్దతిలో ఫాగింగ్ కార్యక్రమం జరుగుతుందా లేదా తెలుసుకోచ్చని తెలుస్తోంది. ఏవిధమైన ఆటంకాలు గాని, సమస్యలు చోటు చేసుకున్నప్పుడు ఈ యాప్ నోటిఫికేషన్ ఇవ్వడం మూలంగా వాటిని కార్యాలయం నుండే పరిష్కరించొచ్చని తెలుస్తోంది. ఈ పద్దతి ద్వారా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో దోమల బెడద నివారణకు అవకాశాలు మెరుగు పడతాయని నగర పాలక సంస్ధ అధికారులు నిర్ధారిస్తున్నారు.

English summary
The city government has taken innovative measures to control mosquitoes in Hyderabad. GHMC officials are adopting innovative methods to rid the city population of mosquitoes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X