India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సులో కోడికి ఫుల్ టికెట్ కొట్టిన కండక్టర్.. షాక్ ఇచ్చిన అధికారులు; అసలీ కోడి కథ ఏంటంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వింతైన సంఘటన జరిగింది. ఆర్టీసీ బస్సులో కోడిని తీసుకువెళ్ళిన ఘటన చోటు చేసుకోగా, ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు కండక్టర్ కోడికి కూడా రూ.30 ఫుల్ టికెట్ ఇచ్చాడు. ఈ సంఘటన తెలిసిన వారంతా కోడికి కూడా టిక్కెట్ ఉంటుందా అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వార్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

కోడిని చీరలో చుట్టి బస్సులో తీసుకెళ్ళే యత్నం చేసిన ప్రయాణికుడు

కోడిని చీరలో చుట్టి బస్సులో తీసుకెళ్ళే యత్నం చేసిన ప్రయాణికుడు

ఇక అసలు విషయానికి వస్తే గోదావరిఖని బస్ స్టాండ్ నుండి కరీంనగర్ కు వెళుతున్న ఓ ప్రయాణికుడు గోదావరి ఖని వద్ద ఆర్టీసీ బస్సులో ఎక్కాడు. కరీంనగర్ వెళ్లాల్సిన బస్సు కండక్టర్ (బస్సు కండక్టర్) ఆ వ్యక్తితో తనతో పాటు ఒక చీరలో కోడిని చుట్టి కనిపించకుండా దాచిపెట్టి ఎక్కింది గమనించలేదు. రామగుండంలోని బి పవర్ హౌస్ వద్ద మహ్మద్ అలీ బస్సు ఎక్కి బస్సు సిబ్బందికి కనిపించకుండా కోడిని చీరతో కప్పాడు. కానీ దానిని అరవకుండా ఆపలేకపోయారు.

కోడి అరవటంతో గమనించిన కండక్టర్ .. టికెట్ తీసుకోవాలని వాగ్వాదం

ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బస్సు సుల్తానాబాద్ బస్టాండ్‌కు చేరుకోగానే చీర లోపల కోడి అరవడం ప్రారంభించింది . అటు ఇటు కదలటం ప్రారంభించింది. దీంతో దానిని గమనించిన బస్సు కండక్టర్ తిరుపతి, మహ్మద్‌ అలీపై అసహనం వ్యక్తం చేశాడు . ఏం తీసుకెళ్తున్నావో చూపించాలని ప్రయాణికుడిని నిలదీశాడు . చీరలో కోడి ఉందని గుర్తించిన కండక్టర్‌ ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. ఇక సమయం వృథా చేయకుండా కోడికి కూడా టికెట్ తీసుకోవాలని సూచించాడు.

 ఫైనల్ గా కోడికి ఫుల్ టికెట్ కొట్టిన కండక్టర్

ఫైనల్ గా కోడికి ఫుల్ టికెట్ కొట్టిన కండక్టర్

కోడికి టికెట్ ఏంటని ఇరువురి మధ్య వాదన జరిగిన తరువాత, ఎట్టకేలకు కోడికి ఫుల్ టికెట్ రూ.30 టికెట్ ఇచ్చిన కండక్టర్ శాంతించాడు. కోడికి టిక్కెట్ ఇవ్వడంపై ఆర్టీసీ బస్సులో ఎక్కిన మనుషులతో పాటు ప్రాణమున్న జీవాలు ఉంటే వాటికి కూడా టికెట్ వసూలు చేస్తామని కండక్టర్ చెప్తున్నాడు. అయితే అధికారుల వాదన అందుకు భిన్నంగా ఉంది. అలా ఇవ్వటానికి వీల్లేదని, ఆర్టీసీ నిబంధనలను ఉల్లంఘిస్తే కచ్చితంగా వారిని బస్సు నుండి క్రిందికి దింపాల్సిందే అంటున్నారు.

AP Movie Ticket Prices దేశమంతా ఒకే GST టిక్కెట్ రేట్లూ అలాగే Chiranjeevi || Oneindia Telugu
బస్సులో కోడికి టికెట్ పై స్పందించిన డిపో మేనేజర్

బస్సులో కోడికి టికెట్ పై స్పందించిన డిపో మేనేజర్

ఇక ఈ ఘటనపై గోదావరిఖని డిపో మేనేజర్ వి.వెంకటేశం మాట్లాడుతూ.. బస్సుల్లో జంతువులను అనుమతించడం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధమన్నారు. కోళ్ళను బస్సుల్లో తీసుకువెళ్లనివ్వకూడదని పేర్కొన్నారు. వాహనంలో ఉన్న ప్రయాణికుడి వద్ద కోడి ఉందని గమనించడంలో కండక్టర్ విఫలమయ్యాడు. తన విధులను విస్మరించాడని ఆయన పేర్కొన్నారు . కోడి ఉందని చూసినప్పుడే కండక్టర్ ప్రయాణికుడిని బస్సు నుంచి దించాల్సి ఉంది. కానీ అలా చేయకుండా కోడి కి కూడా టిక్కెట్ ఇచ్చి ప్రయాణించేందుకు వీలు కల్పించినందుకు ఆర్టీసీ కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ వెంకటేశం చెప్పారు.

English summary
The incident took place in Telangana,K Peddapalli district, the bus conductor gave a ticket for Rs 30, to the hen. Depo manager said they will take action on the conductor who gave a ticket to hen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X