వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆవుకు పాటల పిచ్చి: విన్పించకపోతే...

By Narsimha
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: పాటలంటే మనలో చాలా మందికి ఇష్టం. అయితే ఓ ఆవు కూడ పాటలంటే పిచ్చి. ఒక గంట పాటలు వినకపోతే గందరగోళం చేస్తోంది. అయితే మొబైల్ ఫోన్‌లో భక్తి గీతాలను ఆన్ చేసి ఆవు మెడలో వేశాడు. దీంతో ఈ పాటలను ఆ ఆవు ఆస్వాదిస్తోంది. మనుషుల మాదిరిగానే తలను పైకి కిందికి, అడ్డంగా ఊపుతూ పాటలను ఎంజాయ్ చేస్తోంది.

సంగీతం రాళ్ళను కూడ పిండి చేస్తోందని చెబుతుంటారు. పూర్వ కాలంలో సంగీతం రాళ్ళను ముక్కలు చేసిన చరిత్ర ఉన్నందునే ఈ మాట వాడుకలోకి వచ్చిందని పూర్వీకులు చెబుతుండేవారు.

అయితే మారుతున్న పరిస్థిుతుల్లో సమాజంలో అనేక మార్పులు కూడ చోటు చేసుకొంటున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఆవు మాత్రం పాటు వినకపోతే ఇతరులను ఇబ్బందులు పెడుతోంది.

 సంగీతమంటే ఆవుకు పిచ్చి

సంగీతమంటే ఆవుకు పిచ్చి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీకాంత్‌కు ఆవులంటే ఇష్టం. రెండు సంవత్సరాల క్రితం రూ.28వేలు వెచ్చించి ఒంగోలు దేశవాళి ఆవును ఆయన కొనుగోలు చేశారు. దాని కోసం చిన్న షెడ్డును నిర్మించారు. ఆవుకు గౌరి అని పేరు పెట్టారు. ఈ గ్రామంలో ఉన్న దేవాలయంలో ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు భక్తి పాటలు పెడతారు.ఈ పాటలకు ఆ ఆవుకు అలవాటు పడింది.

గుడి వద్దకు వెళ్ళి పాటు వినేది

గుడి వద్దకు వెళ్ళి పాటు వినేది

షెడ్డులో ఉన్న ఆవు.. దేవాలయంలో పాటలు పెట్టగానే ఆ పాటలు వినేందుకు గుడి వద్దకు వెళ్ళేది. ప్రతి రోజూ ఉదయం రెండు గంటలపాటు ఆవు పాటలు వినేందుకు ఆ గుడి వద్ద ఉండేది. పాటలు ఆపివేశాక ఆవు గందరగోళాన్ని సృష్టించేది.

 పాటలు ఆపేస్తే గందరగోళం

పాటలు ఆపేస్తే గందరగోళం

రెండు గంటల పాటు పాటలు వింటూ ఎంజాయ్ చేసిన ఆవు ఇంటికి తిరిగొచ్చే సమయంలో సమీపంలోని ఇళ్ళలోని వస్తువులను చిందరవందర చేసేది. షెడ్డులోకి చేరుకొనేది. సాయంత్రం తిరిగి పాటలు పెడితే ఆవు కుదుటపడేది.

మొబైల్‌ఫోన్‌లో పాటలు విన్పిస్తూ

మొబైల్‌ఫోన్‌లో పాటలు విన్పిస్తూ

పాటలు వినకపోతే ఆవు గందరగోళం చేస్తోందని శ్రీకాంత్ అర్ధం చేసుకొన్నాడు. ఓ మెమరీ కార్డ్‌లో భక్తి గీతాలను రికార్డ్ చేశాడు. ఓ మొబైల్ ఫోన్‌లో ఆ మెమరీకార్డును అమర్చాడు. ఆ ఫోన్‌లో భక్తి పాటలను ఆన్ చేసి ఆవు మెడలో ఫోన్‌ను బిగించాడు. ఈ పాటలకు అనుగుణంగా ఆ ఆవు తలాడిస్తూ రోజంతా గడుపుతోంది.

 భక్తి గీతాలు కాకుండా వేరే గీతాలు పెడితే

భక్తి గీతాలు కాకుండా వేరే గీతాలు పెడితే

భక్తి గీతాలు కాకుండా వేరే గీతాలను ఆవుకు విన్పిస్తే ఆవు మాత్రం ఊరుకోదు. గందరగోళం సృష్టిస్తోంది .పొద్దున రెండు గంటల, మధ్యాహ్నం ఒక గంట, సాయంత్రం రెండు గంటలు పాటలు వింటూ కుదురుగా ఉంటోంది. తలను ఆడిస్తూ... కిందికీ, మీదికీ ఊపుతూ భక్తి పాటలను ఆస్వాదిస్తుంది.

English summary
A strange incident in Nizambad district.A Cow Listen singing a song at Kothapally in Nizamabad district .Srikanth, Who is cow owner.srikanth arranged a mobile phone on cow head for listen songs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X