హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గురునానక్ కాలేజీ వేడుకల్లో అపశృతి: విద్యార్థిని కంట్లో దిగిన ‘రాకెట్’

గురునానక్ కాలేజీ దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. దీపావళికి తమ ఇంటికి వెళ్లేందుకు కాలేజీ యాజమాన్యం సెలవులు ఇవ్వకపోవడంతో కాలేజీ హాస్టల్లోనే వేడుకలను జరుపుకున్నారు విద్యార్థులు. టపాసులు పేల్చుతూ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Eye injuries during This Diwali దీపావళి విషాదం : Video | Oneindia Telugu

హైదరాబాద్: గురునానక్ కాలేజీ దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. దీపావళికి తమ ఇంటికి వెళ్లేందుకు కాలేజీ యాజమాన్యం సెలవులు ఇవ్వకపోవడంతో కాలేజీ హాస్టల్లోనే వేడుకలను జరుపుకున్నారు విద్యార్థులు. టపాసులు పేల్చుతూ 12మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు.

కాగా, ఓ రాకెట్ దూసుకొచ్చి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని కంట్లో దిగింది. దీంతో ఆమెకు తీవ్రగాయమైంది. వెంటనే ఆమెను సరోజనీ దేవి కంటి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందించిన వైద్యులు.. కంటి చూపుకోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.
48గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

A Engineering Student Suffers Eye Sight Damage In Diwali Firecracker Bursting

క్రాకర్స్ కాల్చడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. కాగా, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. కనీసం గాయపడిన తన కూతురును చూసేందుకు కాలేజీకి చెందిన యాజమాన్యం రాలేదని అన్నారు.

ప్రమాదం జరిగిందని సమాచారం ఇవ్వడంతో తాను హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నట్లు తెలిపారు. ఇది ఇలావుంటే.. దీపావళి వేడుకల్లో నగరంలో మొత్తం 25మంది గాయపడ్డారు. వివిధ ఆస్పత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు.

English summary
An engineering student suffered serious injury resulting in loss of eye sight due to bursting of firecrackers during the Diwali celebrations here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X