మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందంగా ముస్తాబు చేసి దూడకు బారసాల

|
Google Oneindia TeluguNews

మెదక్: తన గేదెకు దూడ పుట్టి 21 రోజులు అయిన సందర్భంగా ఆ దూడను తొట్టెలో వేసి ఘనంగా బారసాల నిర్వహించాడో రైతు. జిల్లాలోని జిన్నారం గ్రామానికి చెందిన మ్యాదరి రమేష్ అనే రైతు వద్ద కొన్ని గేదెలున్నాయి. అందులో ఓ గేదెకు దూడ పుట్టడంతో అతని కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.

దీంతో 21 రోజుల పండుగను ఘనంగా చేయాలని నిర్వహించుకుని.. అలాగే చేశాడు. దూడను పడుకోబెట్టి బారసాల నిర్వహించాడు. అనంతరం కుటుంబసభ్యులు, స్నేహితులను పిలిచి సంబరాలను జరుపుకున్నాడు. ఆ దూడకు ఐశ్వర్య అనే పేరు కూడా పెట్టారు.

విషాదాన్ని మిగిల్చిన విహారరయాత్ర: 20మందికి గాయాలు

A farmer held cradle ceremony to his buffalo's calf

విహార యాత్రకు వెళ్లిన ఓ ప్రైవేటు బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓవర్ లోడ్‌తో వెళ్తున్న లారీ.. బస్సును వేగంగా వచ్చి డీకొంది. దీంతో బస్సులోని 20మందికి గాయాలయ్యాయి.

వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఓ స్వచ్ఛంద సంస్థ వృద్ధులను బస్సులో నాగార్జున సాగర్ విహారయాత్రకు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సును హెల్పేజ్ ఇండియా బస్సుగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A farmer held cradle ceremony to his buffalo's calf in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X