వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనను తాను పాతిపెట్టుకుని ...పట్టా దారు పాసు బుక్ కోసం ఓ రైతు నిరసన ..

|
Google Oneindia TeluguNews

దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదు అన్న చందంగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలోని రెవిన్యూ శాఖలో పరిస్థితి. రెవిన్యూ శాఖ ఉద్యోగుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినా , పట్టాదారు పాసు పుస్తకాల జారీలో అలసత్వం వహించకుండా రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పినా రెవిన్యూ శాఖ పనితీరు ఏ మాత్రం మారలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా రెవెన్యూ శాఖలో పరిస్థితి తయారైంది.

జగన్ దేవుని బిడ్డ: పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వింత భజనజగన్ దేవుని బిడ్డ: పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వింత భజన

సీఎం కేసీఆర్ హెచ్చరించినా మారని రెవెన్యూ శాఖ

సీఎం కేసీఆర్ హెచ్చరించినా మారని రెవెన్యూ శాఖ


రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి సాయం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా ఉంటానని ప్రకటించింది. రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుంది.ఇక నేటికీ కొందరు రైతులకు ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చెయ్యాల్సి ఉంది. అయితే అధికారులు పట్టా దారు పాసు పుస్తకాల మంజూరులో అవకతవకలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే తెలంగాణా సీఎం కేసీఆర్ మొత్తం రెవెన్యూ శాఖనే ప్రక్షాళన చెయ్యాలని నడుం బిగించారు.

పీకల లోతు గోతిలో పూడ్చిపెట్టుకొని ఓ రైతు వినూత్న నిరసన

పీకల లోతు గోతిలో పూడ్చిపెట్టుకొని ఓ రైతు వినూత్న నిరసన

తన భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని చాలా కాలంగా కాలికి బలపం కట్టుకొని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఓ రైతు సహనం నశించి చివరకు ఆందోళన బాట పట్టారు. వినూత్నంగా తన నిరసనను తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండలం రామన్నగూడెం కు చెందిన రైతు అధికారుల తీరుపై అసహనంతో తనను తాను పీకల లోతు గోతిలో పూడ్చి పెట్టుకొని నిరసన తెలియజేశారు. పట్టాదార్ పాస్ బుక్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సుధాకర్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ భూమి లోనే ఆరడుగుల గొయ్యి తీసి ఆ గోతిలో తనను తాను పూడ్చి పెట్టుకొని తన ఆవేదనను తెలియజేశారు.

తన భూమికి పట్టాదారు పాస్ బుక్ కోసం.. పాస్ బుక్ ఇచ్చిన తహసీల్దార్

తన భూమికి పట్టాదారు పాస్ బుక్ కోసం.. పాస్ బుక్ ఇచ్చిన తహసీల్దార్

తన తండ్రి నుండి తనకు వారసత్వంగా వచ్చిన 4.39 ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని చాలా కాలంగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయాడు సుధాకర్ రెడ్డి. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన అధికారులెవరు తనను పట్టించుకోవడం లేదని పొలం వద్ద ఛాతివరకు గొయ్యి తవ్వకుని అందులో తనను తాను పూడ్చుకొని నిరసన చేపట్టాడు. ఇక రైతు సుధాకర్ రెడ్డి చేపట్టిన నిరసనతో వెంటనే రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవి ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలని వెంటనే రైతు సుధాకర్ రెడ్డి కి పాసు బుక్​ అందించారు. దీంతో రైతు ఆందోళన విరమించాడు.

రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణా ప్రజల్లో అసహనం

రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణా ప్రజల్లో అసహనం

అయినప్పటికీ ఈ విషయం తెలిసిన స్థానిక రైతులు ఆందోళన చేసే వరకు స్పందించని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ అధికారుల తీరు ఏమాత్రం మారలేదని వారంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక గతంలోనూ ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్టుగా పని చేసే ఓ రైతు నాగేందర్ రెడ్డి ఇదే తరహాలో నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుధాకర్ రెడ్డి సైతం వినూత్నంగా నిరసన తెలియజేసి తనకు రావాల్సిన పట్టాదారు పాసు పుస్తకాలను తన నిరసన ద్వారా సంపాదించుకున్నారు.

English summary
A farmer who turned around to the revenue authorities for his landlord's passbook was issued by his protest today .Sudhakar Reddy, a farmer from Ramannagudem, Narasimhulupeta Mandalam, Mahabubabad district, took a six-feet pit in his farmland and buried himself in the land and did a protest .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X