సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో యువతితో పెళ్లి: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్‌: గత రెండున్నర సంవత్సరాల నుంచి తనను ప్రేమించి తాను లేకుంటే జీవించలేనని ఎన్నెన్నో మాయమాటలు చెప్పి.. ప్రేమ ముగ్గులోకి దించి చివరకు కాదు పొమ్మని... మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది తెలిసిన ప్రేమించిన యువతి ఆదివారం ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరానికి దిగింది. యువతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన గాడిమిద్దెల స్వప్న గత మూడు సంవత్సరాల నుంచి ఎస్‌వి జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తన సహచర లెక్చరర్‌గా పనిచేస్తున్న అయోధ్య గ్రామానికి చెందిన ఉబ్బపల్లి నాగరాజు ఆ యువతిని ప్రేమించానని తన వెంటపడి నువ్వు లేకుంటే బ్రతకలేని చెప్పి ప్రేమించినట్లు చెప్పాడు.

ఈ నేపథ్యంలో అప్పి నుండి ఒకరికి ఒకరు చూడకుండా ఉండలేకపోయారు. యువతిని పలుమార్లు నాగరాజుతో మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనగా ఇప్పుడెందుకు తొందర కొన్ని రోజులు ఆగమని యువతిని మభ్యపెడుతూ వచ్చాడన్నారు. తీరా ఆ యువకుడు వేరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి ప్రియుడి ఇంటికి చేరుకోగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం చేస్తోంది. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

A girl protest at lover's house

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న మాజీ నక్సలైట్ల అరెస్టు

సిద్దిపేట: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండి బెదిరింపులకు పాల్పడుతున్న ఆరుగురు మాజీ నక్సలైట్లను పట్టుకుని వారి నుంచి ఒక పిస్టల్‌, మూడు 9 ఎంఎం రివాల్వర్‌లతో పాటు 58 బుల్లెట్లు, 250 గ్రాముల పేలుడు పదార్థం, 20 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లును స్వాధీనం చేసుకున్నట్టు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ వి. శివకుమార్‌ వెల్లడించారు. సోమవారం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తొగుట మండలం వెంకరావుపేట గ్రామానికి చెందిన రేపాక స్వామి గతంలో మావోయిస్టు కొరియర్‌గా ఎవోబిలో పనిచేశాడని ఈ సందర్భంగా అక్రమంగా ఆయుధాలు తనవద్ద ఉంచుకుని బెదిరింపులకు, మసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. స్వామిని పట్టుకుని విచారించగా 2013లో ఎవోబీ మావోయిస్టు నాయకులకు కొరియర్‌గా పని చేస్తుండగా సూర్యపేటకు చెందిన రఘు అనే వ్యక్తి నుంచి రెండు పిస్టళ్లు, 39 బుల్లెట్లను తన వద్ద వుంచుకున్నాడని తెలిపారు.

రఘు గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి నుంచి ఏడు ఆయుధాలను కొనుగోలు చేసి మావోయిస్టు పార్టీ ఆదేశానుసారం రూపాక స్వామితో పాటు ఆలేరు మండలం సరాజీపేటకు చెందిన వెంకటేశ్‌కు ఒక రివాల్వర్‌, శాలిగౌరారం మండలం ఉటుకూరుకు చెందిన వేముల రాంచందర్‌కు ఒక పిస్టల్‌ను అందజేశారు. మిగిలిన రెండు ఆయుధాల్లో ఒక రఘు మామ బాలయ్యకు భద్రపరచమని ఇవ్వగా ఆయన భయపడి మూసీ నదిలో పారవేయగా, మరో ఆయుధాన్ని తన వద్దనే ఉంచుకున్నట్లు తెలిపారు.

రూపాక స్వామి గతంలో చర్లపల్లి జైలులో ఉన్న కావలి యాదగిరి అనే మావోయిస్టును కలిసేవాడు. ఈ సమయంలో అతడికి మావోయిస్టు సానుభూతి పరులైన కొండపాక మండలం సిరిసినగండ్లకు చెందిన మంతూరు బాలనర్సు, ఆలేరు మండలం సదాశిపేటకు చెందిన వెంకటేశ్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

అప్పటి నుంచి తమ వద్ద ఉన్న ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో సిద్దిపేట ఏసీపీ నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరపడంతో వీరితో సంబంధమున్న రూపాక స్వామి, రఘు, గుండ్లపల్లి వెంకటేశ్‌, వేముల రాంచదర్‌తో ఆయుధాలు అమ్మిన రంజిత్‌కుమార్‌కు అరెస్టు చేయగా మావోయిస్టు సానుభూతిపరుడు మంతూరు బాలనర్సు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు. ఈ కేసును ఛేధించడంలో చురుకైన పాత్ర పోషించిన ప్రత్యేక బృందం సభ్యులను అభినందించి నగదు పురస్కారాలను కమిషనర్‌ వారికి అందజేశారు. ఈ సమావేశంలో డిసిపి, ఏసీపీ తదితరులున్నారు.

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం

మహబూబాబాద్‌: వారాంతపు సంత నుంచి ఇంటికి తిరిగి వెళ్తుడంగా సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న దమ్ములు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం కురవి మండలం నేరడ శివారు కాకులబోడు తండాకు చెందిన ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై కురవిలో జరిగిన వారాంతపు పశువుల సంతకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుున్నారు.

మహబూబాబాద్‌ మండలం మాధవాపురం శివారు ఇస్లావత్‌ తండా వద్ద జేసీబీ వాహనాన్ని తప్పించే క్రమంలో వాహనం నడుపుతున్న గుగులోతు రమేష్‌ ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆయన వెనుక కూర్చున్న గుగులోతు హచ్చు(50), గుగులోతు జగన(56) కింద పడ్డారు. హచ్చు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన జగన్‌ మహబూబాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో మృతి చెందాడు.రమేష్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఒకే కుటుంబంలో ఇద్దరు దుర్మరణం చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. హచ్చుకు భార్య, ఇద్దరు కుమారులు, జగన్‌కు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మహబూబాబాద్‌ డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌ సందర్శించారు.

English summary
A girl protest at lover's house in Mahabubabad district for her marriage with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X